Telangana Weather: తెలంగాణాలో అల్పపీడనం ప్రభావం.! మరో రెండ్రోజులు భారీ వర్షాలు..

|

Jul 30, 2024 | 4:04 PM

తెలంగాణాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని తాజాగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

తెలంగాణాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని తాజాగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 1వ తేదీ నుంచి గురువారం వరకు సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం వరకు 312.2 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 407.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.