Telangana Rains: కొన్నిచోట్ల క్లౌడ్ బరస్ట్ తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక!
తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దక్షిణం ఒడిస్సా ఉత్తరాంధ్ర సమీపంలో సముద్రమట్టం నుండి 4.5 కి.మీ ఎత్తు వరకు చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది.
మరోవైపు ఉపరితల చక్రవాత ఆవర్తనం అల్పపీడనంగా బలపడనుంది. వీటి ప్రభావంతో శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణ లోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాతావరణశాఖ వివరాలు ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల క్లౌడ్‌బరస్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం మెదక్‌లో క్లౌడ్‌బరస్ట్ కావడంతో మూడు గంటల్లోనే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం హైదరాబాద్‌లో సైతం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇది గంట గంటకూ మారవచ్చని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం తులం ఎంతంటే?
దేవాలయాల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం
Kishkindhapuri: సగం భయపెట్టి.. సగం వదిలేస్తే ఎలా? హిట్టా..? ఫట్టా..?
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

