Loading video

రేషన్‌కార్డుదారులకు.. రేవంత్‌ సర్కార్‌ గుడ్ న్యూస్‌

|

Mar 27, 2025 | 4:36 PM

రేషన్ కార్డుల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అర్హులైన రేషన్ కార్డుదారుల ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. దొడ్డుబియ్యం స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వనుంది సర్కార్. పేదలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో బియ్యం కావాలంటే 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ జరగనుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌.. స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్నిరోజులంటే..?

Varun Tej: ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా

Ram Charan: దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్

TOP 9 ET News: డబుల్‌ కా మీటా! ఇది కదా బర్త్‌ డే బంప్స్‌ అంటే!

Court: సంచలనంగా కలెక్షన్స్‌.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్టు మూవీ