Telangana: తెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి తీవ్రత

Updated on: Jan 06, 2026 | 7:38 PM

తెలంగాణలో జనవరి 5 నుండి 12 వరకు తీవ్రమైన చలిగాలులు, పొగమంచు ఆవహిస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. డిసెంబర్ మొదటి వారపు కోల్డ్‌వేవ్ పరిస్థితులు పునరావృతమవుతాయి. జనవరి 9 నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తీర, రాయలసీమ ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరగనుంది. జనవరి 5 నుంచి వారం రోజుల పాటు జనవరి 12 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. గజగజ వణికించేలా చలిగాలులు వీస్తాయని, డిసెంబర్ మొదటి వారంలో ఉన్నటువంటి ‘కోల్డ్‌వేవ్’ పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయని హెచ్చరించారు. జనవరి 6, 7 తేదీల్లో తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోనుంది. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 25-26 డిగ్రీల మధ్యనే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ జనవరి 8 తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో జనవర 9వ తేదీ నుంచి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రామాల్లో ఇసుక లారీల దూకుడు ఆగమవుతున్న పల్లె జనం

బస్సు డ్రైవర్‌గా మదురో ప్రస్తానం.. పుట్టపర్తి సాయిబాబాకు వీరభక్తుడు

బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే

Hyderabad: గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు

పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి