మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో ఎగిరిన యుద్ధ డ్రోన్లు

Updated on: Jan 06, 2026 | 6:41 PM

టర్కీకి చెందిన కిజిలెల్మా డ్రోన్‌లు ప్రపంచంలోనే మొదటిసారిగా మానవ ప్రమేయం లేకుండా కృత్రిమ మేధస్సు సాయంతో స్వయంప్రతిపత్తితో క్లోజ్ ఫార్మేషన్ ఫ్లైట్‌ను నిర్వహించాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లు, డేటా మార్పిడిని ఉపయోగించి, రెండు డ్రోన్‌లు సమన్వయంతో ఎగిరాయి. ఈ అద్భుత విజయం టర్కీని యుద్ధ డ్రోన్ టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలబెట్టింది, భవిష్యత్తులో డ్రోన్ దాడులకు మార్గం సుగమం చేసింది.

కృత్రిమ మేధస్సు అన్ని రంగాలలో చొచ్చుకుపోతోంది. ప్రపంచంలోనే మొదటిసారిగా, ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా రెండు డ్రోన్లు అతి సమీపంలో విహారించాయి. తమకు అనుసంధానించిన సెన్సర్లతో సమాచారాన్ని పంచుకున్నాయి. ఈ ప్రయత్నం చేసింది అమెరికా, చైనా, రష్యా కాదు టర్కీ దేశం. టర్కీకి చెందిన కిజిలెల్మా డ్రోన్‌లు మానవ ప్రమేయం లేకుండా స్వయంప్రతిపత్తితో క్లోజ్ ఫార్మేషన్ ఫ్లైట్‌ను నిర్వహించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్‌బోర్డ్ సెన్సార్లు, విమానం మధ్య తక్షణ డేటా మార్పిడిని ఉపయోగించి క్లోజ్ ఫార్మేషన్ ఫ్లైట్‌ను పూర్తి చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. దగ్గర ప్రయాణానికి, రెండు డ్రోన్‌ల మధ్య సమన్వయం అవసరం. లేకుంటే ఢీకొనే ప్రమాదం ఉంది. మానవరహిత యుద్ధ వైమానిక డ్రోన్ల విషయంలో ఇది సాధ్యమైంది. వీటిని కిజిలెల్మా డ్రోన్లుగా పిలుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్‌బోర్డ్ సెన్సార్లు, డేటా మార్పిడి సాయంతో రెండు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకున్నాయని మీడియా కథనాలు తెలిపాయి. రెండు డ్రోన్లు ఖచ్చితమైన సమన్వయంతో అటానమస్ మోడ్‌లో ఎగిరాయని ఫైటర్ జెట్‌ విమానాలల మాదిరిగానే అధిక వేగంతో దూసుకుపోయాయి. మానవ ప్రమేయం లేకుండా రెండు డ్రోన్ల ను ఏఐ సాయంతో ఎగురవేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా టర్కీ నిలిచింది. టర్కిష్ రక్షణ సంస్థ బేకర్ ఈ డ్రోన్లను తయారు చేసింది. ఈ విజయంతో, టర్కీ ఇప్పుడు యుద్ధ డ్రోన్లను ఎగురవేసే సాంకేతికతను అందిపుచ్చుకుంది. విమాన నిర్వహణ అల్గోరిథంలో చేసిన మార్పుతో మానవ జోక్యం లేకుండా ఎగరగలవు. సమీప భవిష్యత్తులో రెండు కంటే ఎక్కువ డ్రోన్లు ఒక సమూహంలా దాడి చేసే అవకాశం ఉంది. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి సమాచారాన్ని పంచుకుంటాయి డ్రోన్లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana: గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతి లోపే రైతు భరోసా

తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..

ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు

వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం