భారత్‌లో ఉద్యోగాలకు ‘టెస్లా’ ప్రకటన..మోదీ చేసిన ‘మ్యాజిక్‌’ఇది వీడియో

Updated on: Feb 23, 2025 | 2:00 PM

ఎలన్ మస్క్ ఇండియాలోకి అడుగు పెట్టేశారు. టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు, ఎలన్ మస్క్ ప్రొడక్టులను అమ్ముకోవటానికి రెడీ అయిపోయారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత.. మస్క్ అత్యంత వేగంగా ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే టాప్ పొజిషన్ లో 13 మందిని నియమించుకోవాలని నిర్ణయించినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో టెస్లా ఆపరేషన్స్ ప్రారంభించటానికి తొలి అడుగుగా టాప్ లెవల్లో ఈ రిక్రూట్ మెంట్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు లింక్డ్ ఇన్ లో పోస్టులు కనిపిస్తున్నాయి. కస్టమర్‌తో నేరుగా సంప్రదింపులు జరిపే పోస్ట్‌లతో పాటు బాకెండ్‌ జాబ్స్‌ కోసం అభ్యర్థుల్ని ఆహ్వానిస్తోంది.

13 పోస్ట్‌లలో ఐదింటికి సంబంధించిన సర్వీస్‌ టెక్నిషియన్‌, అడ్వైజరీ పోస్ట్‌లు ముంబయి ఢిల్లీ కేంద్రంగా నియామకాలు జరపనున్నారు. ఇదే విధంగా ఇండియాలో మూడు చోట్ల టెస్లా ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని.. ఒకటి గుజరాత్, మరొకటి ఏపీ, మరో ప్రాంతం అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. టెస్లా ప్లాంట్లతోపాటు ఇండియాలో మూడు షోరూమ్స్ ప్రారంభించాలని కూడా భావిస్తుంది కంపెనీ. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సిటీల్లో టెస్లా ఎక్స్ క్లూజివ్ షోరూమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తుంది టెస్లా. విదేశీ కార్లపై భారీగా సుంకాలు విధిస్తుండటంతో ఇన్నాళ్లు టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయింది. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ, ఎలన్ మస్క్ భేటీ తర్వాత.. హై ఎండ్‌ విదేశీ కార్లపై ఉన్న సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల ఎంట్రీకి రూట్ క్లియర్ అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం :

ఖతర్నాక్‌ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్‌ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..వీడియో

ఆ గ్రామానికి ఏమైంది?కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం వీడియో

ఓర్నీ.. అది ఆటోనా..ఆర్టీసీ బస్సా..పోలీసులకు షాకిచ్చిన వీడియో

బర్డ్‌ఫ్లూ భయమే లేదు.. అక్కడ ఊరు ఊరంతా పండగే..వీడియో