ఏది కొనాలన్నా.. దాన్నే అడుగుతున్న ఇండియన్స్..
రెస్టారెంట్‌లో ఏదైనా ఆర్డర్ చేయాలన్నా.. మిత్రులు,కుటుంబీకుల కోసం ఓ బహుమతి కొనాలన్నా.. గూగుల్ సలహా తీసుకోవటం మనకు తెలుసు. అయితే, ఈ మధ్య గూగుల్ స్థానంలో చాట్‌జీపీటీ వచ్చి చేరింది. మొత్తంగా.. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో అనుమానం వస్తే.. క్లారిటీ కోసం టెక్నాలజీపై ఆధారపడటం భారతీయుల్లో క్రమంగా పెరుగుతోందని తాజా సర్వే బయటపెట్టింది.
రోజువారీ జీవితంలో ఇది భాగమైందని ప్రజలే చెప్పడం గమనార్హం. ఓవర్ థింకింగ్‌కు సంబంధించి సెంటర్ ఫ్రెష్, యూగవ్ (YouGov)లు సంయుక్తంగా ఇటీవల ఓ సర్వే నిర్వహించాయి. విద్యార్థులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారితో సహా 2వేల మందికిపైగా ఇందులో పాల్గొన్నారు. టైర్ I, II, III నగరాల నుంచి స్పందనలు వచ్చాయి. ఆహారం, జీవనశైలి అలవాట్లు, డిజిటల్, సోషల్ లైఫ్, డేటింగ్, రిలేషన్‌షిప్, కెరీర్ తదితర అంశాలపై ప్రశ్నలకు స్పందించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 81శాతం మంది నిత్యం మూడు గంటలకంటే ఎక్కువ సమయం ఈ సెర్చింగ్ కోసం కేటాయిస్తున్నట్లు తేలింది. ఇది నిత్య జీవితంలో భాగమైందని సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ఒకరు చెప్పారు. షార్ట్ మెసేజ్‌లను డీకోడ్ చేయడం నుంచి గిఫ్ట్‌ల కొనుగోలు నిర్ణయం వరకు గూగుల్ లేదా చాట్‌జీపీటీపైనే ఆధారపడుతున్నట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు వెల్లడించారు. రాజకీయ నాయకుడిని ఎంపిక చేసుకోవడం కంటే రెస్టారెంట్‌లో ఆహారాన్ని ఎంచుకోవడమే ఒత్తిడిగా ఫీలవుతున్నట్లు 63శాతం మంది అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వంటింటి సింక్‌లో వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..
పాపం ఫస్ట్ టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైయ్యారుగా
సరదా అనుకున్నారు.. చావు దెబ్బ తిన్నారు.. పావురాలతో ఆటలా
చెప్పులే కదా అని చటుక్కున వేసుకుంటున్నారా.. పక్కకు తీసి చూడగా షాక్
గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం యువకుడి చందాలు.. ఏంటి మామా నీకు ఈ ఖర్మ