మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు

|

Apr 27, 2024 | 8:44 PM

మార్స్ పై స్పైడర్లు.. ఒకటీ రెండు కాదు కుప్పలు కుప్పలుగా కనిపిస్తూ ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయి. నల్లటి సాలె పురుగుల్లాంటి ఆకారాలు.. అంగారకుడి చుట్టూ తిరుగుతున్న ఫొటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ ఉపగ్రహం తీసిన చిత్రాల్లో ఇవి కనిపించాయి. మరి ఏమిటా ఆకారాలు? వీటి గురించి శాస్త్రవేత్తలు ఏం తేల్చారో తెలుసుకుందామా.. అంగారకుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఎప్పుడూ విపరీతంగా చల్లగా ఉంటుంది.

మార్స్ పై స్పైడర్లు.. ఒకటీ రెండు కాదు కుప్పలు కుప్పలుగా కనిపిస్తూ ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయి. నల్లటి సాలె పురుగుల్లాంటి ఆకారాలు.. అంగారకుడి చుట్టూ తిరుగుతున్న ఫొటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ ఉపగ్రహం తీసిన చిత్రాల్లో ఇవి కనిపించాయి. మరి ఏమిటా ఆకారాలు? వీటి గురించి శాస్త్రవేత్తలు ఏం తేల్చారో తెలుసుకుందామా.. అంగారకుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఎప్పుడూ విపరీతంగా చల్లగా ఉంటుంది. అంతేగాకుండా అంగారకుడిపై కార్బన్ డయాక్సైడ్ శాతం చాలా ఎక్కువ. దక్షిణ ధ్రువ ప్రాంతంలో చల్లదనానికి కార్బన్ డయాక్సైడ్ మంచులా గడ్డకట్టి అక్కడి నేల పొరల దిగువన చేరుతుంది. అంగారకుడిపై ఎండాకాలం రాగానే.. అక్కడి నేల పొరల దిగువన ఉన్న కార్బన్ డయాక్సైడ్ వేడెక్కి గ్యాస్ గా మారుతుంది. ఈ గ్యాస్ ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పేలిపోతుంది. దాంతో నేలలోని నల్లటి మట్టి ఎగిసిపడుతుంది. ఇలా సుమారు ఒక మీటర్ ఎత్తున నల్లటి మట్టి కుప్పలు ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు

కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??

17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే

పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??

అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??

Follow us on