Mark Zuckerberg: ఎలాన్ మస్క్ తో కేజ్ ఫైట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న జుకర్ బర్గ్.

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందంటూ మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్టులో ఈ మేరకు తెలిపింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో జుకర్ బర్గ్ కు ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్ ‘జు జిట్సు’ లో ఆయన బ్లూ బెల్ట్ సాధించారు. జుకర్ బర్గ్ తో సహా మెటా కంపెనీలోని ముఖ్యమైన సిబ్బంది పోరాట క్రీడల్లో పాల్గొంటున్నారని మెటా తన రిపోర్టులో పేర్కొంది.

Mark Zuckerberg: ఎలాన్ మస్క్ తో కేజ్ ఫైట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న జుకర్ బర్గ్.

|

Updated on: Feb 05, 2024 | 4:56 PM

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందంటూ మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్టులో ఈ మేరకు తెలిపింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో జుకర్ బర్గ్ కు ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్ ‘జు జిట్సు’ లో ఆయన బ్లూ బెల్ట్ సాధించారు. జుకర్ బర్గ్ తో సహా మెటా కంపెనీలోని ముఖ్యమైన సిబ్బంది పోరాట క్రీడల్లో పాల్గొంటున్నారని మెటా తన రిపోర్టులో పేర్కొంది. ఈ క్రీడల్లో ప్రమాదం జరిగి వారు గాయపడ్డా, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా కంపెనీ నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది. గతేడాది నవంబర్ లో మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో పాల్గొన్న జుకర్ బర్గ్ గాయపడ్డ విషయాన్ని కంపెనీ తన రిపోర్టులో గుర్తుచేసింది. జుకర్ బర్గ్ మోకాలికి గాయమైందని, ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. మరోవైపు, తనతో కేజ్ ఫైట్ కు రమ్మంటూ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ విసిరిన ఛాలెంజ్ ను జుకర్ బర్గ్ స్వీకరించిన విషయం తెలిసిందే. దీని కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వీరిద్దరి ఫైట్ కోసం ఎదురుచూశారు. అయితే, మస్క్ ఈ ఛాలెంజ్ ను తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపిస్తూ జుకర్ బర్గ్ ఈ ఫైటింగ్ ఆలోచనను వదిలేశారు. తాజాగా ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్ బర్గ్ నాలుగో స్థానానికి ఎగబాకారు. బిల్ గేట్స్ ను ఆయన అధిగమించారు. శుక్రవారం కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల అనంతరం మెటా షేర్లు 20 శాతం పెరిగి జుకర్ బర్గ్ సంపద 170.5 బిలియన్ డాలర్లకు చేరింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ 165 బిలియన్‌ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us
Latest Articles
యోనిలో వచ్చే దురద, మంటకు ఇలా చెక్ పెట్టండి..
యోనిలో వచ్చే దురద, మంటకు ఇలా చెక్ పెట్టండి..
ఏలకులను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ మటాషే..
ఏలకులను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ మటాషే..
వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !