iPhone SE 3: తక్కువ ధరకే 5జీ యాపిల్‌ ఫోన్ !! విడుదల ఎప్పుడంటే ?? వీడియో

|

Feb 04, 2022 | 8:42 PM

యాపిల్ కంపెనీ తన సరసమైన ఐఫోన్ SE సిరీస్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సిమైంది. 2022 మార్చి నెలాఖరున ఐఫోన్ ఎస్‌ఈ 3ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

యాపిల్ కంపెనీ తన సరసమైన ఐఫోన్ SE సిరీస్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సిమైంది. 2022 మార్చి నెలాఖరున ఐఫోన్ ఎస్‌ఈ 3ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్ల‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ ఈ ఫోన్‌ 2022 మొదటి త్రైమాసికంలో విడుదల చేయవచ్చని తెలిపారు. ఐఫోన్ ఖరీదైన మోడల్‌లను కొనుగోలు చేయలేని వినియోగదారుల కోసం ఐఫోన్ SE సిరీస్‌ను ప్రారంభించింది. TenTechReview (టెన్‌టెక్‌ రివ్యూ) నివేదిక ప్రకారం, రాబోయే iPhone SE 3 డిజైన్‌ను ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. ఈ ఫోన్‌ డిజైన్‌ కూడా పాత ఫోన్‌ మోడల్‌లోనే ఉంటుంది. ఇందులో కూడా ఒకే కెమెరా లెన్స్‌తో ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో కొన్ని మార్పులు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. Face ID కోసం ఫ్రంట్ ఫేసింగ్ డిస్‌ప్లేను iPhone SE 3లో అందించనున్నారు.

Also Watch:

వింత శిశువు జననం !! నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో !! వీడియో

పగలు బొమ్మ.. రాత్రయితే దెయ్యంలా.. ఎలా ?? వీడియో

ప్రియురాలి తల్లికి కిడ్నీని దానం చేసిన ప్రియుడు !! వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి !! వీడియో

Viral Video: జిరాఫీని చుట్టు ముట్టిన సింహాలు !! ఎలా తప్పించుకుందో తెలుసా !! వీడియో

ప్రపంచంలోనే అతి ఎత్తయిన సైకిల్‌గా గిన్నిస్‌ రికార్డు !! వీడియో