Gamyam App: మీరు ప్రయాణించే బస్సు ఎక్కడుందో తెలుసుకోండి ఇలా..!

|

Mar 18, 2024 | 4:59 PM

మ‌నం ప్రయాణించాల్సిన బ‌స్సు స‌మాచారం తెలిపే గ‌మ్యం యాప్‌ను టీఎస్ఆర్‌టీసీ ఏడాది క్రితం అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఈ యాప్ కేవ‌లం ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు మాత్రమే ప‌రిమిత‌మైంది. మిగ‌తా వాటిలో దీని జాడ లేదు. మొద‌ట దూర‌ప్రాంతాల‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్, సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ బ‌స్సుల‌కు గ‌మ్యం యాప్ అనుసంధానించారు. ఆ త‌ర్వాత న‌గ‌రంలో తిరిగే అన్ని బ‌స్సుల‌కు అమ‌ర్చాల‌ని ప్రయ‌త్నించారు.

మ‌నం ప్రయాణించాల్సిన బ‌స్సు స‌మాచారం తెలిపే గ‌మ్యం యాప్‌ను టీఎస్ఆర్‌టీసీ ఏడాది క్రితం అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఈ యాప్ కేవ‌లం ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు మాత్రమే ప‌రిమిత‌మైంది. మిగ‌తా వాటిలో దీని జాడ లేదు. మొద‌ట దూర‌ప్రాంతాల‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్, సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ బ‌స్సుల‌కు గ‌మ్యం యాప్ అనుసంధానించారు. ఆ త‌ర్వాత న‌గ‌రంలో తిరిగే అన్ని బ‌స్సుల‌కు అమ‌ర్చాల‌ని ప్రయ‌త్నించారు. ఇక కొత్త బ‌స్సులు స‌మ‌కూరితే వాటిలో వెహిక‌ల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్‌) అర్చాల‌ని నిర్ణయించారు. మొత్తం 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఆగ‌స్టు నాటికి రానున్నాయి. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వీటిని తీసుకువ‌స్తున్నట్లు టీఎస్ఆర్‌టీసీ అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగా మంగ‌ళ‌వారం ప్రారంభించిన‌ 22 బ‌స్సుల్లో గ‌మ్యం యాప్‌ను అనుసంధానం చేశారు. ఓవైపు అద్దెకు ఎల‌క్ట్రిక్ బ‌స్సులు తీసుకుంటుండగానే TSRTC సొంతంగా 565 డీజిల్ బ‌స్సులు స‌య‌కూర్చుకుంటోంది. ఈ సంవ‌త్సరం మొత్తం 1,100 కొత్త బ‌స్సులు రానున్నాయి. వీటి అన్నింటిలోనూ గ‌మ్యం యాప్ అందుబాటులో ఉంటుంది. ఇలా బ‌స్సుల‌ను ఈ యాప్‌ను అనుసంధానం చేసి ప్రయాణికుల‌కు బ‌స్సుల జాడ తెలిసేలా చ‌ర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని టీఎస్ఆర్‌టీసీ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 18, 2024 03:48 PM