AI Voice: ఇది ఏఐ మిమిక్రీ.. మీ గొంతు జాగ్రత్త.! బీ అలెర్ట్ అంటున్న నిపుణులు.

AI Voice: ఇది ఏఐ మిమిక్రీ.. మీ గొంతు జాగ్రత్త.! బీ అలెర్ట్ అంటున్న నిపుణులు.

Anil kumar poka

|

Updated on: Apr 07, 2024 | 3:58 PM

అది ఇది ఏమని అన్నిరంగములనేలేస్తూ..మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందా అనిపిస్తోంది. కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్‌ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌లో భాగంగా వాయిస్‌ ఇంజిన్‌ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది.

అది ఇది ఏమని అన్నిరంగములనేలేస్తూ..మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందా అనిపిస్తోంది. కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్‌ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌లో భాగంగా వాయిస్‌ ఇంజిన్‌ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్‌ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్‌ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు.

మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్‌ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్‌ క్లోనింగ్‌ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్‌ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్‌ ఇంజిన్‌ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..