ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తన విజన్ చూపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కీలక ప్రకటనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా గ్రోక్ 3 సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ మోడల్‌ను భూమిపైన అత్యంత తెలివైన ఏఐ సాధనంగా అభివర్ణించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.