గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?

Updated on: Mar 05, 2025 | 6:40 PM

వైఆర్‌4 అనే గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమిని ఢీ కొట్టే అవకాశం రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో అసలు భూమిని నిజంగానే ఢీ కొంటే ఏ ప్రాంతంలో ఢీ కొంటుందని కూడా సైంటిస్టులు అంచనా వేశారు. ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఇండియా కూడా ఉంది.

మరి ఇండియా మొత్తానికీ ఏమైనా ప్రమాదమా అంటే.. కాదు. ఇండియాలోని కొన్ని నగరాలకే ముప్పు పొంచి ఉందంటున్నారు. మానవాళి, కోట్లాది జీవరాశులు ఉన్న భూ గ్రహానికి ముప్పు పొంచి ఉందని గతేడాది డిసెంబర్‌లో నాసా ఓ సంచలన ప్రకటన చేసింది. ఓ గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు దూసుకొస్తోందని, అది కనుక భూమిని ఢీ కొంటే ఓ 500 బాంబులు పడినంత విధ్వంసం సృష్టిస్తుందని తెలిపారు. 2024 డిసెంబర్‌ 27న చిలీలోని ఎల్ సాస్ అబ్జర్వేటరీ ఈ ముప్పును అంచనా వేసింది. ఈ అబ్జర్వేటరీ కూడా నాసా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఈ గ్రహశకలానికి 2024 YR4 అనే పేరు పెట్టారు. 2032 డిసెంబర్‌లో ఇది భూమిని ఢీ కొనే ఛాన్స్‌ ఉందంటున్నారు. తొలుత ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశం తక్కవగానే ఉందని అంచనా వేశారు. కానీ, వారం వ్యవధిలోనే అది 2.3 శాతానికి పెరిగింది. ఈ వైఆర్‌4 గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశం 3.1 శాతంగా ఉందని నాసా తెలిపింది. అంటే క్రమక్రమంగా భూమికి ముప్పు ఉండే ఛాన్స్‌ పెరుగుతుందని అర్థం. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైతం 2.8 శాతంగా అంచనా వేసింది. చూసేందుకు చాలా తక్కువ సంఖ్యలోనే ప్రమాదం సంభవించే అవకాశం కనిపిస్తున్నా.. అది చాలా విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంది. వచ్చే నెల అంటే మార్చ్‌లో అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా నాసా శాస్త్రవేత్తలు ఆ గ్రహశకలాన్ని పరిశీలించనున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్ యాక్సిడెంట్ జరిగిందా? కంగారు పడకండి.. ఈ పనులు చేస్తే అంతా సేఫ్​!

ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్‌.. సింగిల్‌ ప్రీమియంపై నెలనెల పెన్షన్‌.. ఎంతంటే

భార్యకోసం లగ్జరీ కారుకొన్న భర్త.. ఆమెకు నచ్చకపోవడంతో