చంద్రుడి మట్టిలో నీరుందా? తాజా పరిశోధన ఏం చెప్పింది?

Updated on: Aug 11, 2025 | 6:59 PM

అంతరిక్ష పరిశోధనల తీరును మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వినియోగించి చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించి, దానితో ఆక్సిజన్‌, ఇంధనానికి అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం ఒక గ్యాలన్‌ నీటిని చంద్రునిపైకి తీసుకెళ్లడానికి 69 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. చంద్రునిపై పరిశోధనలకు ఇదే పెద్ద అడ్డంకిగా ఉంది.

చైనాకు చెందిన చాంగ్‌ ఈ-5 మిషన్‌ ద్వారా వచ్చిన చంద్రుని మట్టిని విశ్లేషించినపుడు, నీటి ఖనిజాలు ఉన్నట్లు రుజువైంది. దీంతో భవిష్యత్తులో పరిశోధకులు ఈ వనరులను వినియోగించగల అవకాశం కనిపించింది. గతంలో చంద్రునిపై నీటిని సంగ్రహించే పద్ధతులు అత్యంత సంక్లిష్టంగా, అత్యధిక ఇంధనం అవసరమయ్యేవిగా ఉండేవి. కార్బన్‌డయాక్సైడ్‌ను ఇంధనంగా రీసైకిల్‌ చేయడంలో ఆ పద్ధతులు విఫలమయ్యాయి. చంద్రునిపైకి మానవుడు వెళ్లడానికి సవాలుగా మారిన పరిస్థితులను ఈ కొత్త టెక్నాలజీ పరిష్కరించే అవకాశం ఉంది. చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ పరిశోధకుడు లూ వాంగ్‌ చెప్పింది ఒక్కటే.. వ్యోమగాములు శ్వాస ద్వారా విడుదల చేసే కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చేందుకు కాంతిని ఉపయోగించే ప్రక్రియ ఉంటుంది. అలాగే చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించడాన్ని దీంతో అనుసంధానం చేయడమే గొప్ప విజయమని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ ఏక కాలంలో జరుగుతుందన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏది కొనాలన్నా.. దాన్నే అడుగుతున్న ఇండియన్స్‌..

వంటింటి సింక్‌లో వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..

పాపం ఫస్ట్ టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైయ్యారుగా

సరదా అనుకున్నారు.. చావు దెబ్బ తిన్నారు.. పావురాలతో ఆటలా

చెప్పులే కదా అని చటుక్కున వేసుకుంటున్నారా.. పక్కకు తీసి చూడగా షాక్‌