Watch Video: ఇంకా స్పేస్ స్టేషన్లోనే సునీతా విలియమ్స్… మస్క్ వైపే అందరి చూపు..!

ఏ ముహూర్తానా రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దర్నీ రోదసిలోకి తీసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాయిదా పడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్‌కి పంపించింది. ఇదుగో ఇవి సునీత విలియమ్స్ స్సేప్ క్రాఫ్ట్‌లో ఆ రోజు అడుగుపెడుతున్న దృశ్యాలివి. మూడోసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు కూడా.

ఈ నెల ప్రారంభంలో ప్రముఖ ఆస్ట్రోనాట్… సునీతా విలియమ్స్… ఆమె కొలీగ్ బుచ్ విల్ మోర్ ఇద్దర్నీ నాసా స్పేస్‌కి పంపించిందన్న విషయం గుర్తుందా..? నిజానికి ఆటంకాలతోనే మొదలైన వాళ్ల ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడొస్తారన్న క్లారిటీ రావట్లేదు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఆ రోజొస్తారు.. ఈ రోజొస్తారని చెబుతున్నారే తప్ప…పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదు . భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర ఇది మూడోసారి. అయితే వాళ్ల మిషన్ కేవలం 8 రోజులు మాత్రమే అంటే జూన్ 13 తిరిగి భూమికి రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ జూన్ 26న తిరుగు ప్రయాణం అవుతారని నాసా చెప్పింది.. కానీ మళ్లీ అదే సమస్య స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం వాయిదా పడినట్టు నాసా ప్రకటించింది. వ్యోమనౌకలో హీలియం లీకేజీ సమస్య ఏర్పడటంతో దాన్ని సరిదిద్దే పనిలో స్టార్ లైనర్ ఇంజనీర్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా పరిష్కారం దొరకలేదు. దీంతో సునీతా విలియమ్స్, మరో వ్యామోగామి బుచ్ విల్ మోర్ ఎప్పుడు భూమికి తిరిగి వస్తారన్న విషయంలో స్పష్టత లేదు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి మరిన్ని ప్రీమియం వార్తల కోసం

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి