Aditya L1 Solar Mission: మిషన్ ఆదిత్యతో ఇస్రో సరికొత్త చరిత్ర.. సూర్యుడి రహస్యాల గుట్టు విప్పనున్న ఆదిత్య-L1
చందమామను ముద్దాడిన ఇస్రో, సూర్యుడిని చేరుకునేందుకు సిద్ధమైంది. మండే సూర్యుడి రహస్యాల ఛేదనకు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను కాసేపట్లో ప్రయోగించనుంది. సునాయాసంగా చంద్రయానం చేసిన భారత్‌ను చూసి ఆశ్చర్యం ప్రకటించిన ప్రపంచ దేశాలు.. ఆదిత్య ప్రయోగాన్ని మరింత ఆసక్తిగా గమనిస్తున్నాయి. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇస్రో.. PSLV_C 57 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.
చందమామను ముద్దాడిన ఇస్రో, సూర్యుడిని చేరుకునేందుకు సిద్ధమైంది. మండే సూర్యుడి రహస్యాల ఛేదనకు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను కాసేపట్లో ప్రయోగించనుంది. సునాయాసంగా చంద్రయానం చేసిన భారత్‌ను చూసి ఆశ్చర్యం ప్రకటించిన ప్రపంచ దేశాలు.. ఆదిత్య ప్రయోగాన్ని మరింత ఆసక్తిగా గమనిస్తున్నాయి. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇస్రో.. PSLV_C 57 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. కౌంట్‌డౌన్ ముగియగానే ఆదిత్య ఎల్-1 నిప్పులు చిందుతూ ఎగరడానికి రెడీ అయ్యింది. 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రయాన్-3 విజయంతో శ్రీహరికోటలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొని ఉంది. ఆదిత్య మిషన్ ప్రయోగం నేపేథ్యంలో షార్‌లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొదటి గేటు, రెండో గేటు వద్ద CISF సిబ్బంది వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. సూళ్లూరుపేట- శ్రీహరికోట మార్గంలో అవుట్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. PSLV_C 57 రాకెట్ ప్రయాణం నాలుగు దశల్లో కొనసాగనుంది. 44.4 మీటర్ల పొడవున్న ఈ రాకెట్ 138 టన్నుల బరువున్నట్లు ఇస్రో చెబుతోంది. సరిగ్గా 11 గంటల 50 నిమిషాలకు కౌంట్‌డౌన్ పూర్తికావడం.. రాకెట్ నింగికి ఎగరడం ఏకకాలంలో జరగనున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెయిల్స్ స్టిక్కర్స్ తో కోట్లు సంపాదిస్తున్న మహిళ !!
విమానం రెక్కలపై డాన్స్ !! వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్
ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త.. లేదంటే జరిగేది ఇదే !!
ఇంటర్నెట్ డేటా లేకున్నా.. ఎంచక్కా TV, OTT ప్రసారాలు చూడొచ్చు !!
అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు