పిల్లలకు చాయ్ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
పిల్లలు మారాం చేస్తున్నారని టీ తాగిస్తున్నారా? అయితే అసలుకే మోసం జాగ్రత్తా అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. టీలో ఉండే కెఫిన్ పిల్లల శరీరానికి చాలా హానికరం. రోజూ ఎక్కువ మొత్తంలో టీ ఇస్తే పిల్లల శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఈ కారణంగా వారు బద్దకంగా తయారవుతారు. ఎసిడిటీ సమస్యను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
అంతేకాకుండా టీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా మూత్రవిసర్జన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీ ఇవ్వకపోవడమే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పిల్లల నిద్రపై టీ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడం వంటి సమస్యలు వస్తాయి. సరిగా నిద్రపోయే పిల్లల్లోనే శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. పిల్లలకు టీ ఇవ్వడం వల్ల వారి నిద్రపై ప్రభావం పడి వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. చిన్న పిల్లలు టీ తాగడం వల్ల వారికి దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు టీ ఇవ్వడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్ న్యూస్
పోస్టాఫీసులకు మహిళల పరుగు.. తీరా అకౌంట్ ఓపెన్ చేస్తే..
వింటర్‌లో ఇవి తింటే.. బాడీకి ఫుల్ పవర్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

