Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాప్సికమ్‌ అంటే ఇష్టమా ?? అయితే ఈ వీడియోను చూస్తే ??

క్యాప్సికమ్‌ అంటే ఇష్టమా ?? అయితే ఈ వీడియోను చూస్తే ??

Phani CH

|

Updated on: Jun 05, 2024 | 3:07 PM

క్యాప్సికమ్ ఆహారానికి ఎంతో రుచిని ఇస్తుంది. అంతేకాదు ఇది ఎంతో ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిని ఇష్టపడని వారుండరు. అలా ఓ మహిళ.. మార్కెట్‌ నుంచి ఆ ఇంట్లోని వారికి ఎంతో ఇష్టమైన తాజా క్యాప్సికమ్‌ను తీసుకొచ్చింది. ఇక కూర వండుదామని వాటిని కట్‌ చేసింది. అంతే అందులో పొడవాటి తెల్లని దారం కనిపించింది. ఇందులోకి దారం ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ దానిని తొలగించే ప్రయత్నం చేసిన ఆ మహిళ.. ఒక్కసారిగా షాక్‌ తింది.

క్యాప్సికమ్ ఆహారానికి ఎంతో రుచిని ఇస్తుంది. అంతేకాదు ఇది ఎంతో ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిని ఇష్టపడని వారుండరు. అలా ఓ మహిళ.. మార్కెట్‌ నుంచి ఆ ఇంట్లోని వారికి ఎంతో ఇష్టమైన తాజా క్యాప్సికమ్‌ను తీసుకొచ్చింది. ఇక కూర వండుదామని వాటిని కట్‌ చేసింది. అంతే అందులో పొడవాటి తెల్లని దారం కనిపించింది. ఇందులోకి దారం ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ దానిని తొలగించే ప్రయత్నం చేసిన ఆ మహిళ.. ఒక్కసారిగా షాక్‌ తింది. ఎందుకంటే ఆమె దారం అనుకున్న ఆ తెల్లని ఆకారం కదులుతోంది. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ క్యాప్సికమ్ ను తరుగుతుండగా అందులో దారం ఆకారంలో ఉన్నదొకటి బయటపడింది. చూడటానికి దారం లాగా ఉన్న ఆ జీవి అత్యంత ప్రమాదకరమైన పురుగట. క్యాప్సికమ్ లో కనిపించే ఈ పురుగును తొలగించకుండా తింటే తీవ్ర అనారోగ్యం తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి మరణం కూడా తప్పదట. ఈ పురుగు కడుపులోకి చేరాక అక్కడున్న కణజాలాన్ని తినేస్తుందట. చివరకు అది మరణానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఈ పురుగు గుడ్లు కడుపులోకి వెళ్లినా ఇబ్బందులు తప్పవట. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇక పురుగును చూసిన వారందరూ జడుసుకుంటున్నారు. చూడటానికి దారం లాగా ఉన్న దీంతో ఇంతటి ప్రమాదమా అని నోరెళ్లబెడుతున్నారు. అసలు క్యాప్సికమ్ లో ఇలాంటి పురుగులు ఉంటాయన్న విషయమే తమకు తెలియదని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. కూరలు తరిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పురుగులు, పుచ్చులు లేకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ లైక్‌ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కీళ్లనొప్పులకు పెయిన్‌కిల్లర్స్‌ వాడుతున్నారా.. జాగ్రత్త

తల్లి ప్రేమ.. తప్పుడు పని చేయించింది.. అసలు ఏం జరిగిందంటే

ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ట్రైన్లో మీ ​ సీట్లో మరొకరు కూర్చున్నారా ?? గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి

Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్‌ దెబ్బకు దడుసుకుంది పో