రూ.2వేల నోటు మార్పిడికి మరో 5 రోజులే గడువు..

|

Sep 27, 2023 | 10:06 AM

దేశంలో 2వేల రూపాయల నోటును మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన డెడ్‌లైన్‌ మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. సెప్టెంబర్‌ 25 నుంచి 27 వరకూ బ్యాంకులు యథావిథిగా పనిచేయనున్నాయి. ఇక 28వ తేదీన గురువారం నాడు బ్యాంకులకు సెలవు.

దేశంలో 2వేల రూపాయల నోటును మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన డెడ్‌లైన్‌ మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. సెప్టెంబర్‌ 25 నుంచి 27 వరకూ బ్యాంకులు యథావిథిగా పనిచేయనున్నాయి. ఇక 28వ తేదీన గురువారం నాడు బ్యాంకులకు సెలవు. అనంతరం 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి. ఈ నాలుగు రోజుల్లోనే మీ వద్ద ఉన్న 2వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు వీలు ఉంటుంది. బ్యాంకుల నుండి అందిన డేటా ప్రకారం, సెప్టెంబరు 1 నాటికే 3.32 లక్షల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఆర్‌బీఐ వద్దకు చేరాయి. దీంతో దేశంలో చలామణిలోకి పంపిన 2వేల నోట్లు 93 శాతం తిరిగి వచ్చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాహుబలి విమానం వచ్చేసింది.. ఇక శత్రువులకు గుండెదడే !!

రోగులకు చేతబడి చేశారంటూ క్షుద్రపూజలు చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు !! చివరికి ??

Navdeep: నవదీప్‌ గుట్టంతా ఆ మొబైల్‌ ఫోన్‌లోనే !! ఫోన్‌ తెరిస్తే హీరో పని ఔట్‌.

Elon Musk: ఎలాన్ మస్క్ మంత్రమేశాడు.. రోబో యోగా చేస్తోంది

Delhi Metro: మెట్రోలో మారని బుద్ధి.. బహిరంగంగా కౌగిలింతలు, ముద్దులు

 

Follow us on