Srisailam: శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కేజీల నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్‌ భక్తులు

Edited By:

Updated on: Apr 18, 2026 | 10:08 PM

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని.. దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు దాతలను ఆశీర్వదించారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని.. దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. 2 కేజీల 400 గ్రాముల బరువైన నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకుడు విజయ స్వామి శివ శంకరయ్య, టెంపుల్ అధికారులు లొడ్డ మల్లికార్జున, గంజి రవి ప్రధానార్చకుడు సమక్షంలో విరాళంగా అందించారు. అనంతరం స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాగాభరణాన్ని అందజేసిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులను ఆలయ ఆశ్చకులను ఆశీర్వధించారు. దేవస్థానం రసీదు వేద ఆశీర్వచనం శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు ప్రసాదాలతో దాతను టెంపుల్ అధికారి లొడ్డమల్లి మల్లికార్జున,గంజిరవి సత్కరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Apr 18, 2026 10:07 PM
Follow Us