విరాట్ కెరీర్‌లోని చెత్త రికార్డ్13 ఏళ్లలో ఇదే తొలిసారి వీడియో

Updated on: Oct 20, 2025 | 4:35 PM

ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది. ఈ డకౌట్‌తో కోహ్లీ వన్డే ఇంటర్నేషనల్స్‌లో రోహిత్ శర్మను అధిగమించి, అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మూడు ఫార్మాట్లలో ఇది 39వ డకౌట్, వన్డేల్లో 17వది. కోహ్లీ భవిష్యత్తుపై అభిమానుల్లో అనుమానాలు నెలకొన్నాయి.

చాలా కాలం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో తీవ్రంగా నిరాశపరిచాడు. పెర్త్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. ఈ డకౌట్ కోహ్లీకి ఒక అరుదైన రికార్డును అందించింది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను అధిగమించాడు.ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కోహ్లీకి ఇది 39వ డకౌట్. 551 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 39 సార్లు సున్నాకే అవుట్ అయ్యాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (44), ఇషాంత్ శర్మ (40) కోహ్లీ కన్నా ముందున్నారు. హర్భజన్ సింగ్ 37, జస్ప్రీత్ బుమ్రా 35 డకౌట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు