Watch Video: అది నోబాల్ కాదు.. డెడ్ బాల్ అసలే కాదు.. బ్యాటర్ మాత్రం క్లీన్‌బౌల్డ్.. కానీ, నాటౌట్‌‌.. ఎందుకో తెలుసా?

|

Dec 19, 2021 | 11:12 AM

Trending Video: బ్యాట్స్‌మెన్ ఔట్ కాకముందే చాలా సార్లు నాటౌట్‌లు ఇచ్చారు. కానీ, ఇక్కడ బ్యాట్స్‌మెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అది నో బాల్ కానే కాదు..

Watch Video: అది నోబాల్ కాదు.. డెడ్ బాల్ అసలే కాదు.. బ్యాటర్ మాత్రం క్లీన్‌బౌల్డ్.. కానీ, నాటౌట్‌‌.. ఎందుకో తెలుసా?
Cricket Viral Video
Follow us on

Viral Video: క్రికెట్‌లో అద్భుత దృశ్యాలు కనిపించడం కొత్తేమీ కాదు. బ్యాట్స్‌మెన్ ఔట్ కాకముందే చాలా సార్లు నాటౌట్‌లు ఇచ్చిన మ్యాచులు ఎన్నో చూశాం. కానీ, ఇక్కడ బ్యాట్స్‌మెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బాల్ కూడా నో బాల్ కాదు. అంటే, బౌలర్ అద్భుతమైన డెలివరీని విసిరింది. అయినప్పటికీ, బ్యాట్స్‌మన్ నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఈ షాకింగ్ దృశ్యం కనిపించింది. హోబర్ట్‌లోని మైదానంలో క్వీన్స్‌లాండ్ వర్సెస్ టాస్మానియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ సంఘటన ఆ జట్టు ఓపెనర్ జార్జియా వాల్‌తో జరిగింది.

ఈ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ కొనసాగుతోంది. ఈ ఓవర్‌ను తాస్మానియా బౌలర్ వకరేవా సంధించింది. ఈ ఓవర్ తొలి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. రెండవ బంతికి సింగిల్, జార్జియా వాల్ నాన్-స్ట్రైకర్‌తో స్ట్రైక్ ఎండ్‌కి వచ్చింది. మూడో బంతికి పరుగు రాలేదు. అదే సమయంలో టాస్మానియా బౌలర్ వేసిన నాలుగో బంతి నేరుగా వికెట్ కీపర్ గ్లౌస్‌లోకి వెళ్లింది. అయితే అంతకుముందే బెయిల్స్‌ను చెదరగొట్టింది.

నాటౌట్‌గా బ్యాట్స్‌మెన్..
క్రికెట్ రూల్స్ ప్రకారం, అప్పీల్ చేయకపోవడంతో వికెట్ పడలేదన్నమాట. ఔట్‌కు సంబంధించి టాస్మానియా ఫీల్డర్ల నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. దీంతో బ్యాటర్ నాటౌట్‌గా నిలిచింది. అసలు విషయం తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయింది. ఫలితంగా క్వీన్స్‌లాండ్‌ ఓపెనర్‌ను నాటౌట్‌గా నిలిచాడు. ఈ సంఘటన జరిగినప్పుడు, జార్జియా వాల్ 39 బంతుల్లో 26 పరుగుతో ఆడుతోంది.

ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో కనిపించిన ఈ దృశ్యంతో క్రికెట్‌లో అప్పీల్‌కి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తోంది. సమయానికి తగిన విధంగా స్పదించడం చాలా ముఖ్యం. టాస్మానియన్ జట్టు కూడా అప్పీల్ చేయనందుకు చింతిస్తుంది. అన్నింటికంటే వారి పొరపాటు కారణంగా, క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మన్‌కు భారీ లైఫ్ లభించింది.

Also Read: Year Ender 2021: తేలిపోయిన అంతర్జాతీయ ఓపెనర్లు.. రోహిత్ శర్మ ముందు అంతా డీలా.. ఈ ఏడాది ఆ లిస్టులో మనోడే నంబర్ వన్‌..!

IND vs SA: లిటిల్ మాస్టర్ అరుదైన రికార్డుకు 11 ఏళ్లు.. తోడుగా నిలిచిన ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాలే..!