ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్ ప్రో లీగ్.. మైదానంలోకి క్రికెటర్లు, నటీనటులు
టీపీఎల్ (టాలీవుడ్ ప్రొ లీగ్) ఫిబ్రవరి 13 నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక క్రికెట్ లీగ్‌లో సినీ నటులు, టెక్నీషియన్లతో పాటు క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా వంటి వారు పాల్గొంటారు. సినీ, క్రీడాభిమానులకు ఇది డబుల్ బొనాంజా. ఆరు జట్లతో కూడిన ఈ టోర్నీ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ప్రముఖులు ట్రోఫీ, జెర్సీని ఆవిష్కరించారు.
తెలుగు సినీ, క్రీడాభిమానులకు ఇదో డబుల్ బొనాంజా న్యూస్. ఒకేసారి ఇటు సినీ అభిమానులను అటు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించే టీపీఎల్ టాలీవుడ్ ప్రొ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రముఖులు పాల్గొనే ఈ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ఆదివారం ఈ లీగ్ ట్రోఫీని, జెర్సీని సినీ, క్రికెట్ ప్రముఖులు ఆవిష్కరించారు. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనాలతో పాటు సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు సోనూ సూద్, సంగీత దర్శకుడు తమన్, నటి రాశీ ఖన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, దిల్ రాజు, సోనూ సూద్ కలిసి స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆడారు.టాలీవుడ్.. క్రికెట్ పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు కపిల్‌దేవ్. హైదరాబాద్ అందమైన నగరమే కాదు, రుచికరమైన వంటకాలకు కేంద్రమని కొనియాడారు. సినీ నటులు, టెక్నీషియన్లు కలిసి క్రికెట్ లీగ్ ఆడటం మంచి పరిణామమన్నారు వీరేంద్ర సెహ్వాగ్. తెర మీద కనిపించే నటులతో పాటు తెర వెనుక ఉండి పని చేసేవారితో కలిసి టీపీఎల్ టోర్నీ జరుగుతుందన్నారు దిల్‌రాజు. ఆరు జట్లతో కూడిన ఈ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లో ప్రముఖ నిర్మాతలు జట్లకు యజమానులుగా వ్యవహరిస్తారని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్
సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా
మారుతున్న ప్రమోషన్ ట్రెండ్… మాయ చేస్తున్న ఏఐ
Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేదెప్పుడు?
