హైదరాబాద్‌లో టీమిండియా క్రికెటర్ తిలక్‌వర్మ సందడి
ఆసియా కప్ ఫైనల్‌లో 69 పరుగులు సాధించి ఒంటి చేత్తో టీం ఇండియాను గెలిపించిన...తిలక్ వర్మ ఇప్పుడు యూత్ ఐకాన్‌గా మారారు. ఆసియా కప్ ఫైనల్ హీరో, మన తెలుగోడు తిలక్‌వర్మ హైదరాబాద్‌లో సందడి చేశాడు. తాను శిక్షణ పొందిన లెగాల క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మ కలియతిరిగాడు. పాకిస్తాన్ ఎలా రెచ్చగొట్టిందో, తాము ఎలా ఆడామో దేశమంతా మళ్లీ వినేలా చెప్పాడు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తిలక్ వర్మ ఇప్పుడు హాట్ ఫేవరేట్. ఎక్కడ చూడు తిలక్ వర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, తెలంగాణ రేవంత్ రెడ్డి తిలక్ వర్మను అభినందించారు. ఆసియా కప్ గెలుపొందడం ఎనలేని సంతోషాన్నిచ్చిందన్నారు తిలక్ వర్మ. పాక్ క్రికెటర్లు నాపై ఒత్తిడి పెంచాలని చూసినా, రెచ్చగొట్టేందుకు యత్నించినా దేశం కోసం ఓపికగా ఆడానని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ క్రికెటర్లలో మార్పు కనిపించిందన్నారు. మరోసారి భారత్‌కు ప్రపంచకప్ సాధించిపెట్టడమే తన లక్ష్యం అన్నారు తిలక్ వర్మ. ఇక హైదరాబాద్ అయితే తిలక్ వర్మ హీరోచిత బ్యాటింగ్‌కు ఫుల్ ఫిదా అయింది. ఆ జోష్ ఎట్లా ఉంటదో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తళుక్కుమంది. తెలంగాణ స్పోర్స్ అథార్టీ చైర్మన్ శివసేనా రెడ్డి తిలక్ వర్మను స్వాగతించి ఘనంగా సత్కరించారు. అభిమానుల కోలాహాలం మధ్య తిలక్ వర్మను గజమాలతో సన్మానించారు. ఆసియా కప్‌లో షంశేర్ బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు మాత్రమే కాదు యావత్ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన తిలక్ వర్మను అభినందించారు శివసేనా రెడ్డి . క్లిష్ట పరిస్థితుల్లో తిలక్ వర్మ జట్టును గెలిపించిన తీరు క్రికెట్ చరిత్రలో మాస్టర్ పీస్‌గా అభివర్ణించారాయన. అభిమానులకు వినమ్రంగా అభివాదం చేస్తూ వెళ్లారు తిలక్ వర్మ. ఐపీఎల్‌లో ముంబయి తరపున ఆడిన తిలక్ వర్మ తన సత్తా ఏంటో చాటాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ముందున్నాడు. బ్యాటింగ్‌లో లెఫ్ట్ హ్యాండర్. బౌలింగ్ లో రైట్ హ్యాండ్. మనోడు స్టాండయితే అపోజిషన్ టీమ్‌కు లెప్ట్ అండ్ రైట్ దబిడి దిబిడే. తన స్ట్రెంత్ ఏంటో ఆసియా కప్‌లో కళ్లకు కట్టిన తిలక్ వర్మ..ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఆసియా కప్ హీరోగా జేజేలందుకుంటున్న మన తిలక్ వర్మ మరిన్ని వండర్స్ సాధించడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trump: మరోసారి సుంకాల బాంబు పేల్చిన ట్రంప్
H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు
నడిచి వెళ్లి చెట్లు ఎక్కే చేపను చూశారా ?? పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్న వింత
తండ్రీ కొడుకుల ప్రాణం తీసిన ఇంటి గోడ
ఆ కీచక తండ్రికి చచ్చే వరకు జైలు శిక్ష.. పోక్సో కేసులో సంచలన తీర్పు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

