T20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆటగాళ్లు వీరే

Updated on: Dec 22, 2025 | 4:44 PM

టీ20 ప్రపంచకప్ 2026 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు చోటు దక్కలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్‌కు అనూహ్యంగా అవకాశం లభించింది. భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది. భారత్ తొలి మ్యాచ్ యూఎస్ఏతో ఆడుతుంది.

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. శుభ్‌మన్‌ గిల్‌ వైస్ కెప్టెన్సీతోపాటు జట్టులో చోటు కోల్పోయాడు. యశస్వి జైస్వాల్‌ ఎంపిక కాలేదు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్‌ కిషన్‌ అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడు ఇటీవల ముగిసిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రాణించాడు. దీంతో సెలక్టర్లు ఇషాన్‌ వైపు మొగ్గు చూపారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. తుది పోరు మార్చి 8న జరగనుంది. భారత్‌ గ్రూప్‌ స్టేజిలో తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో ఆడనుంది. ఫిబ్రవరి 12న మ్యాచ్‌ నమీబియాతో జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌.ప్రేమదాస స్టేడియం వేదికగా టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో టీమ్‌ఇండియా పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్‌ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్‌, మార్చి 5న రెండో సెమీఫైనల్‌ జరగనుంది. భారత జట్టు విషయానికొస్తే అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజుశాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌ , రింకు సింగ్‌, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాన్‌ కిషన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తిలు ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత

అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ

చంపేస్తోన్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డ్‌

కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..

సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే