IPL 2021: బిరియానీ vs పరాటా.. ఎవరిది తడాఖా.. నేడే ఢిల్లీతో కీలక పోరు.. వీడియో
ఐపీఎల్ రెండో దశలో ఇవాళ కీలక పోరుకు తెరలేవనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల బలాబలాల గురించి చర్చించుకుంటే..
ఐపీఎల్ రెండో దశలో ఇవాళ కీలక పోరుకు తెరలేవనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల బలాబలాల గురించి చర్చించుకుంటే.. రెండింటిలోనూ ధీటైన బ్యాట్స్‌మెన్లు, బలమైన మిడిల్ ఆర్డర్.. అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వచ్చేసరికి బలాబలాల గురించి కంటే.. వార్నర్ గురించే చర్చ బాగా జరుగుతోంది. సన్‌రైజర్స్ జట్టుకు ఒంటిచేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు డేవిడ్ వార్నర్. ఆ జట్టుకు అతడే అత్యధిక స్కోరర్‌గా నిలిచిన సందర్భాలు కోకొల్లలు. అలాగే తనదైన శైలి కెప్టెన్సీతో సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు అనూహ్యంగా ఈ ఏడాది కెప్టెన్సీని కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఇక కనిపించడు అని ఊహాగానాలు వినిపించాయి. అయితే కరోనా రావడం ఐపీఎల్ వాయిదా పడటంతో సమీకరణాలు మారిపోయాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: గాఢ నిద్రలోంచి సడెన్‌గా లేచిన చిన్నోడు.. ఆ తరువాత వాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో
Viral Video: హుషారైన కోతి.. జింకపై కూర్చొని స్వారీ.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వీడియో