6,6,6,6,6,6… సిక్సర్ల సునామీ.. 12 బంతుల్లో 50 రన్స్

Updated on: Nov 25, 2025 | 7:41 PM

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీ-ఫైనల్‌లో బంగ్లాదేశ్ A జట్టు అనూహ్య విధ్వంసం సృష్టించింది. చివరి రెండు ఓవర్లలో ఏకంగా 50 పరుగులు రాబట్టి, నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెహరూబ్ హసన్ కేవలం 18 బంతుల్లో 48 పరుగులు (6 సిక్సర్లు) చేసి భారత బౌలర్లను చిత్తుచేశాడు. ఈ మెరుపు దాడి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో తొలి సెమీ-ఫైనల్‌ మ్యాచ్‌‎లో బంగ్లాదేశ్ A జట్టు బ్యాటింగ్ చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. 18 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ స్కోరు 160 మార్కును కూడా దాటదేమో అనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లలో బంగ్లా బ్యాట్స్‌మెన్ చూపించిన మెరుపు దాడితో ఆ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. కేవలం చివరి 12 బంతుల్లోనే 50 పరుగులు రాబట్టడంతో బంగ్లాదేశ్ A జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ అనూహ్య విధ్వంసానికి కారణం మెహరూబ్ హసన్ మెరుపు ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. సాధారణంగా టీ20 క్రికెట్‌లో 19వ ఓవర్ అత్యంత కీలకం. ఈ ఓవర్‌ను వేసిన భారత బౌలర్ నమన్ ధీర్ బంగ్లా బ్యాట్స్‌మెన్ మెహరూబ్ హసన్ చేతిలో దారుణంగా దెబ్బతిన్నాడు. ఈ ఓవర్‌ను మెహరూబ్ సిక్సర్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత మూడవ, నాల్గవ బంతుల్లో వరుసగా మరో రెండు సిక్సర్లు కొట్టాడు. ఐదో బంతిని ఫోర్ కొట్టిన మెహరూబ్, ఆఖరి బంతిని కూడా మళ్లీ సిక్సర్‌గా మలిచాడు. ఈ ఓవర్‌లో మొత్తం 28 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్‌లో 28 పరుగులు వచ్చిన తర్వాత, చివరి ఓవర్‌లో కూడా బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం తగ్గలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన వైశాఖ్ విజయ్ కుమార్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. యాసిర్ అలీ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టగా, చివరి బంతికి మెహరూబ్ హసన్ మళ్లీ సిక్సర్ కొట్టాడు. దీంతో 18 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఉన్న బంగ్లాదేశ్ A స్కోరు, చివరి రెండు ఓవర్లలో 50 పరుగులు రావడంతో 194 పరుగులకు చేరుకుంది. ఈ భారీ స్కోరు సాధించడంలో ఇద్దరు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు ముఖ్యపాత్ర పోషించారు. ఓపెనర్ హబీబుర్ రెహమాన్ సోహన్ 46 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అత్యధికంగా 65 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు స్థిరత్వం అందించాడు. చివరిలో బ్యాటింగ్‌కు వచ్చిన మెహరూబ్ హసన్ కేవలం 18 బంతుల్లోనే 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 48 పరుగులు చేసి భారత బౌలర్లను చిత్తుచేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంట కాలువలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్‌ ఏమయ్యాడంటే

ప్రియుడి మోసం.. బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి

ఏడాదిగా కోమాలో కొడుకు.. ఆలయం ముందు పడుకోబెటిన తండ్రి.. కట్ చేస్తే

కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మ హత్య

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ ఇదే