IPL 2024: హార్దిక్ కాదు.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్‌ శర్మ.? 2024లో ఏం జరగబోతుంది?

|

Dec 26, 2023 | 6:37 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. రాబోయే సీజన్‌లో హిట్‌ మ్యాన్‌ సారథ్యంలోనే ముంబై బరిలోకి దిగనుంది. అదేంటి ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను నియమించారు కదా? మళ్లీ రోహిత్‌ శర్మ ఎందుకు అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. హిట్‌ మ్యాన్‌ కేవలం తాత్కాలిక కెప్టెన్‌ మాత్రమే. స్టాండింగ్‌ కెప్టెన్‌గా మాత్రమే ముంబై జట్టు బాధ్యతలు స్వీకరించనున్నాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. రాబోయే సీజన్‌లో హిట్‌ మ్యాన్‌ సారథ్యంలోనే ముంబై బరిలోకి దిగనుంది. అదేంటి ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను నియమించారు కదా? మళ్లీ రోహిత్‌ శర్మ ఎందుకు అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. హిట్‌ మ్యాన్‌ కేవలం తాత్కాలిక కెప్టెన్‌ మాత్రమే. స్టాండింగ్‌ కెప్టెన్‌గా మాత్రమే ముంబై జట్టు బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రపంచ కప్‌లో గాయపడిన హార్దిక్‌ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని తెలుస్తోంది. అతని చీలమండ గాయం చాలా తీవ్రంగా ఉందని ఐపీఎల్‌ ప్రారంభానికి పాండ్యా ఫూర్తి ఫిట్‌గా ఉండడం అనుమానమేనని సమాచారం. అందుకే ముందు జాగ్రత్తగా హార్దిక్‌ స్థానంలో రోహిత్‌ శర్మనే స్టాండింగ్‌ కెప్టెన్‌గా నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు హార్దిక్‌ కానీ, ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా కొంత కాలం పాటు క్రికెట్‌కు దూరంగానే ఉండనున్నాడట. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే T-20 సిరీస్‌తో పాటు, ఐపీఎల్‌ 2024లోనూ పాండ్యా ఆడకపోవచ్చు. అంటే హార్దిక్ తిరిగి రావడానికి రెండు మూడు నెలలు పట్టవచ్చని సమాచారం. అంటే డైరెక్టుగా T20 ప్రపంచ కప్‌లోనే హార్దిక్‌ బరిలోకి దిగనున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.