ఫుట్‌పాత్‌పై పాలమ్మే వ్యక్తి కూతురు.. వరల్డ్‌ ఛాంపియన్‌

Updated on: Nov 12, 2025 | 3:28 PM

ప్రపంచకప్ విజేత రాధా యాదవ్ కథ ఎందరికో స్ఫూర్తి. పేదరికం, సామాజిక విమర్శలు ఎదుర్కొని ఆమె తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లో రాణించింది. 19 ఏళ్లకే బీసీసీఐ కాంట్రాక్ట్ సాధించి, తండ్రికి షాపు పెట్టించింది. వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆయన ఆనందం వీడియో వైరల్ అయ్యింది. కూతురిని కొడుకులా చూసి, స్వేచ్ఛగా ఎదగనిస్తే కుటుంబానికి అండగా నిలుస్తుందని నిరూపించింది.

ప్రపంచకప్ ఛాంపియన్‌గా ప్రశంసలు, రివార్డులు అందుకున్న భారత మహిళా జట్టు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మహిళా క్రికెటర్లది ఒక్కొక్కరిది ఒక్కోరకమైన స్టోరీ. అందరి లాగానే రాధాయాదవ్‌ కూడా చిన్నప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. కానీ, ఇప్పుడు తాను విశ్వ విజేతగా నిలిచింది. రాధ స్వరాష్ట్రం మహారాష్ట్ర. ముంబైలోని కండీవలీ ప్రాంతానికి చెందిన ఆమె.. వరల్డ్ కప్ విజేతగా ఆదివారం వడోదర చేరుకోగా అపూర్వ స్వాగతం లభించింది. రాధ తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘మాది ముంబైలోని కండీవలీ అనే ప్రాంతం. నాన్న ఓం ప్రకాశ్ ఫుట్‌పాత్ మీద పాలు, కూరగాయలు అమ్మేవారు. నేను క్రికెట్ ఇష్టపడడం చూసి నాన్న ప్రోత్సహించారు. సోదరులు మోను, దీపక్‌లు ప్రోత్సహించడమే కాదు నాకు బౌలింగ్ చేసేవారు. మా సోదరి సోని కూడా మద్దుతుగా నిలవగా నేను ఆటను సీరియస్‌గా తీసుకున్నా. అయితే.. ఇరుగుపొరుగు, బంధువులు మా నాన్నతో మీ కూతురు అబ్బాయిలతో క్రికెట్ ఆడుతోంది. పెళ్లి చేసి పంపకుండా ఆటలు ఆడిస్తున్నావా?’ అని అనేవారు. కానీ, ఆయన వారి మాటలు పట్టించుకోకుండా ‘బిడ్డా.. నువ్వు ఆడు. పెద్ద క్రికెటర్ అవ్వు’ అని ఆశీర్వదించేవారు’ అని వెల్లడించింది రాధ. 19 ఏళ్ల వయసులో బీసీసీఐ కాంట్రాక్ట్ సాధించింది. అప్పుడు వచ్చిన డబ్బులతో తండ్రికి చిన్న షాపు పెట్టించింది. కూతురిని కొడుకులా పెంచి.. స్వేచ్ఛగా ఎదగనిస్తే కుటుంబానికి అండగా నిలుస్తుందని నమ్మిన రాధ తండ్రి నమ్మకం నిజమైంది. నవంబర్ 2న భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీతో మైదానంలో చేసుకున్న సంబురాల్లో రాధ తండ్రి ఓం ప్రకాశ్ కూడా పాల్గొన్నారు. కోచ్ అన్మోల్ మజుందార్ ట్రోఫీని అందించగా తలపై పెట్టుకొని చాలా మురిసిపోయారాయన. తన కూతురి విజయాన్ని ఆయన మనసారా ఆస్వాదించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు

పవన్ కీలక నిర్ణయం.. గ్రామానికో సర్పమిత్ర

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమాకి OTTలో అరుదైన రికార్డ్

Dude: ఎట్టకేలకు డ్యూడ్ సినిమా OTTలోకి.. డేట్స్ ఫిక్స్

Sharwanand: ఎట్టకేలకు విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వా