International Cricket Council: ఇక నుంచి అలా ఔటయితే నాటౌట్.! బ్యాటర్లకు వరం, ఫీల్డింగ్ టీమ్‌కు శాపం
క్రికెట్‌లో వికెట్ కీపర్ చేసే స్టంపింగ్ అప్పీల్స్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇది బ్యాటర్లకు మేలు చేసేదే కాగా ఫీల్డింగ్ చేసే జట్టుకు మాత్రం నిరాశను కలిగించేదిగా ఉంది. ఇకనుంచి స్టంపౌట్‌లలో ఆన్ ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తే.. టీవీ అంపైర్, స్టంపౌట్ మాత్రమే చెక్ చేయాలనే విధంగా నిబంధనలను సవరించారు. ఇంతకుముందు ఒక బ్యాటర్‌ను స్టంపౌట్ చేసినప్పుడు ఫీల్డింగ్ టీమ్ ఆన్ ఫీల్డ్ అంపైర్‌కు అప్పీల్ చేస్తే ఒకవేళ ఆ బ్యాటర్‌గానీ, అతడి కాలు, బ్యాట్ గానీ క్రీజుకు సమీపంగా ఉంటే ఆయన థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసేవాడు.
క్రికెట్‌లో వికెట్ కీపర్ చేసే స్టంపింగ్ అప్పీల్స్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇది బ్యాటర్లకు మేలు చేసేదే కాగా ఫీల్డింగ్ చేసే జట్టుకు మాత్రం నిరాశను కలిగించేదిగా ఉంది. ఇకనుంచి స్టంపౌట్‌లలో ఆన్ ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తే.. టీవీ అంపైర్, స్టంపౌట్ మాత్రమే చెక్ చేయాలనే విధంగా నిబంధనలను సవరించారు. ఇంతకుముందు ఒక బ్యాటర్‌ను స్టంపౌట్ చేసినప్పుడు ఫీల్డింగ్ టీమ్ ఆన్ ఫీల్డ్ అంపైర్‌కు అప్పీల్ చేస్తే ఒకవేళ ఆ బ్యాటర్‌గానీ, అతడి కాలు, బ్యాట్ గానీ క్రీజుకు సమీపంగా ఉంటే ఆయన థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసేవాడు. ఈ క్రమంలో టీవీ అంపైర్.. స్టంపౌట్ కంటే ముందు బంతి బ్యాట్‌కు తాకిందా లేదా..? అన్నది పరిశీలించేవాడు. స్టంపౌట్ కంటే ముందే బ్యాటర్.. ఒకవేళ బ్యాట్‌కు బాల్ తాకితే అది మొదటికే మోసం. కానీ తాజా నిబంధనల ప్రకారం.. టీవీ అంపైర్, ఆన్ ఫీల్డ్ అంపైర్ స్టంపౌట్‌కు రిఫర్ చేస్తే దానిని మాత్రమే చెక్ చేయాలి. అంతకంటే ముందు బంతి బ్యాట్‌కు తాకిందా..? లేదా..? అన్నది పట్టించుకోడు. ఇది బ్యాటర్లకు లాభం చేకూర్చేదే. స్టంపౌట్ రిఫరల్స్ నిబంధనలతో పాటు కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనలలో కూడా ఐసీసీ కీలక మార్పులు చేసింది. ఈ విధానంలో వచ్చే ఆటగాడు అతడు భర్తీ చేయబోయే ప్లేయర్ గనక బౌలింగ్ నిషేధం ఎదుర్కుంటే అతడూ బౌలింగ్ చేయడానికి వీళ్లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.