Hand of god goal ball: ఫుట్‌బాల్‌ బంతి విలువ రూ.19.5 కోట్లు..! దీనికి ఎందుకు ఇంత ధర అంటే..

Updated on: Nov 21, 2022 | 8:49 AM

ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా చేతితో గోల్‌ చేసిన బంతి 2.4 మిలియన్‌ డాలర్ల అంటే భారత కరెన్సీలో 19 కోట్ల 50లక్షల రూపాయలకు వేలంలో అమ్ముడు పోయింది. ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా ప్రఖ్యాతి గాంచిన


ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా చేతితో గోల్‌ చేసిన బంతి 2.4 మిలియన్‌ డాలర్ల అంటే భారత కరెన్సీలో 19 కోట్ల 50లక్షల రూపాయలకు వేలంలో అమ్ముడు పోయింది. ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా ప్రఖ్యాతి గాంచిన ఆ గోల్‌కు సాక్షిగా మిగిలిన ఆ బంతిని ఆ మ్యాచ్‌లో రెఫరీగా వ్యవహరించిన అలి బిన్‌ నాసర్‌ కొనుగోలు చేయడం విశేషం. డిగో మారడోనా 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో క్వార్టర్స్‌లో కొట్టిన ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ ఎంత ప్రసిద్ధి చెందింది. మారడోనా కొట్టిన ఆ బంతి తాజాగా నిర్వహించిన వేలంలో అమ్ముడుపోయింది. క్వార్టర్స్‌లో అర్జెంటీనా స్టార్‌ మారడోనా చేత్తో కొట్టిన ఆ గోల్‌ను మ్యాచ్‌ అధికారులెవరూ గుర్తించలేదు. ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అలీ బిన్‌ నాసర్‌ దగ్గర ఆ బంతి ఇంతకాలం ఉంది. దాన్ని లండన్‌లో వేలం వేశారు. మారడోనా మరో గోల్‌ కూడా కొట్టడంతో అర్జెంటీనా క్వార్టర్స్‌లో గెలిచింది. అదే జోరును కొనసాగించి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మరడోనా తన 60వ ఏట 2020లో మరణించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 21, 2022 08:49 AM