Kohli: ధోనీ సొంతగడ్డపై విరాట్ విశ్వరూపం సచిన్ రికార్డు బద్దలు

Updated on: Dec 01, 2025 | 10:28 PM

రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ తన 52వ సెంచరీతో అదరగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీల రికార్డును అధిగమించాడు. స్వదేశంలో 50+ స్కోర్లు 100 సార్లు సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియా 349 పరుగులు చేసి, సౌతాఫ్రికాకు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెడితే రికార్డులు బద్దలు కావడం సర్వసాధారణంగా మారింది. ఆదివారం సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డేలో కూడా అదే జరిగింది. కోహ్లీ కేవలం 102 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి, తన వన్డే కెరీర్‌లో 52వ సెంచరీని నమోదు చేశాడు. టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135తో పాటు రోహిత్ శర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకాలు చేశారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. విరాట్, రోహిత్ శర్మ, రాహుల్ రాణించటంతో.. దక్షిణాఫ్రికాకు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినట్లయింది. ఇక.. సుదీర్ఘ ఫార్మాట్‌లో 51 శతకాలతో సచిన్ పేరిట ఉన్న రికార్డును కూడా ఈ మ్యాచ్‌తో కోహ్లీ బ్రేక్ చేశాడు.వన్డేల్లో 52వ సారి మూడంకెల స్కోర్ అందుకొని అంతర్జాతీయ క్రికెట్‌ ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీతో చరిత్ర సృష్టించాడు. కోహ్లీ సౌతాఫ్రికా పై ఇప్పటివరకు 6 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ సౌతాఫ్రికా పై 57 వన్డే మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు కొట్టగా, కోహ్లీ కేవలం 32 మ్యాచ్‌లలోనే ఆరు సెంచరీలు కొట్టి, సచిన్ రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు. కోహ్లీ సొంత మైదానంలో వన్డేల్లో అత్యధిక 50-ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి స్వదేశంలో 100 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా కోహ్లీ ఘనత సాధించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rohit Sharma: వరల్డ్ రికార్డ్ కొట్టిన రోహిత్ శర్మ

Today Gold Price: సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా..!

ఫ్లెమింగో ఒంటి కాలి జపం కథేంటో తెలుసా..?

పొదుపుకు ఉత్తమ సూత్రం.. 50/30/20 రూల్

కప్పు కాఫీ రూ.570లు.. స్పెషలేంటో తెలిస్తే