Jonty Rhodes-Sachin Tendulkar: సచిన్‌కు జాంటీరోడ్స్ షాక్.. ఒక్కసారిగా షాకైన ముంబై ఆటగాళ్లు..! వైరల్ అవుతున్న వీడియో..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అతడిది. దిగ్గజ క్రికెటర్ల రికార్డులను సైతం బ్రేక్ చేసి, క్రికెట్‌లో తనకంటూ ఓ స్పెషల్ మార్క్‌ను నెలకొల్పాడు. అయితే...
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అతడిది. దిగ్గజ క్రికెటర్ల రికార్డులను సైతం బ్రేక్ చేసి, క్రికెట్‌లో తనకంటూ ఓ స్పెషల్ మార్క్‌ను నెలకొల్పాడు. అయితే ఇంతటి ఆదరణ పొందిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ నుంచి వెరైటీగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సభ్యులు ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న జాంటీరోడ్స్ కూడా వరుసలో నించున్నారు. అటు ముంబై బృందంలో ఆ జట్టు మెంటార్ గా వ్యవహరిస్తున్న సచిన్ కూడా ఉన్నాడు. సచిన్ దగ్గరకు రాగానే జాంటీరోడ్స్ కిందకు వంగి సచిన్ పాదాలను మొక్కబోయాడు. అది ముందే గమనించిన సచిన్ రోడ్స్‌ను ముందుకు నెట్టేసి ఆ పనిచేయకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత చిరునవ్వు చిందిస్తూ రోడ్స్‌ను హత్తుకున్నారు. జాంటీ రోడ్స్ చూపిన గౌరవానికి చాలా మంది నెటిజన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..