కోహ్లీ, రోహిత్‌ గురించి పఠాన్‌ అంత మాటనేశాడేంటి ??

Updated on: Jan 03, 2026 | 11:12 AM

టెస్టులు, టీ20ల నుంచి దూరమైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐకి కీలక సూచనలు చేశారు. 3 వన్డేల బదులు 5 వన్డేల సిరీస్‌లు, ట్రై సిరీస్‌లు నిర్వహించాలని కోరారు. భారత జట్టు మ్యాచ్‌లు లేనప్పుడు కోహ్లీ, రోహిత్‌లు దేశవాళీ క్రికెట్ ఆడాలని, తద్వారా ఫిట్‌నెస్, గేమ్ ప్రాక్టీస్ మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. వన్డే క్రికెట్‌కు వారిద్దరూ ఊపు తెచ్చారని పేర్కొన్నారు.

టెస్టులు, టీ20ల నుంచి దూరమైన తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ‌లు కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు మైదానంలోకి దిగుతున్నారంటేనే వన్డే క్రికెట్‌కు ఓ ఊపు వస్తుంది. ఈ క్రమంలో కోహ్లీ, రోహిత్‌ భవిష్యత్తుపై బీసీసీఐకి మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు చేశాడు. సిరీస్‌లు మూడు వన్డేలకే పరిమితం కాకుండా, ఐదు వన్డేల సిరీస్‌లు నిర్వహించాలని సూచించాడు. అంతేకాదు, ట్రై సిరీస్ టోర్నీలను కూడా ప్లాన్ చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇటర్వ్యూలో ఇర్ఫాన్ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. మూడు వన్డేల బదులు ఐదు వన్డేలు ఎందుకు ఉండకూడదు? ట్రై సిరీస్ లేదా క్వాడ్రాంగ్యులర్ సిరీస్ అంటే నాలుగు దేశాల మధ్య జరిగే సిరీస్ ఎందుకు ఏర్పాటు చేయలేం? వన్డే క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి పెరిగిందంటే, అందుకు కారణం ఈ ఇద్దరు దిగ్గజాలే అని వ్యాఖ్యానించాడు. భారత జట్టు మ్యాచ్‌లు లేనప్పుడు కోహ్లీ, రోహిత్‌లు దేశవాళీ క్రికెట్ ఆడాలని కూడా ఇర్ఫాన్ సూచించాడు. మ్యాచ్ ఫిట్‌నెస్, గేమ్ ప్రాక్టీస్ కొనసాగాలంటే తరచూ మైదానంలో ఉండటం చాలా కీలకమని అతను అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ ఇంకా దూరంగా ఉంది. కానీ వీరిద్దరూ ఎక్కువగా ఆడితే అంత మంచిది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనప్పుడు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలి అని చెప్పాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీశైలంలో చిరుత హల్చల్‌.. పూజారి ఇంటి ఆవరణలో

‘ఆమె నా కూతురు’ అంటూ.. షాకిచ్చిన టబు

ఘోరమైన పాపం చేశావ్.. హీరోయిన్‌పై ఫైర్ అవుతున్న మత పెద్దలు

Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్‌ కెరీర్‌కే మచ్చలాంటి సినిమా

Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..