ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు
ఐపీఎల్ 2026 మినీ వేలం అబుదాబిలో ఉత్సాహంగా ముగిసింది. కామెరూన్ గ్రీన్ రూ.25.20 కోట్లతో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అత్యధిక ధరకు అమ్ముడైన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లుగా నిలిచారు. పలువురు కీలక ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకోగా, కొందరు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. ఈ వేలం IPL 2026కి జట్లను సిద్ధం చేసింది.
ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 369 మంది ఆటగాళ్లు పాల్గొనగా, కేవలం 77 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ వేలంలో పలువురు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి.ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీనితో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు నెలకొల్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రూ.24.75 కోట్ల రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఇక భారతీయ అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల విభాగంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ సంచలనం సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్ వీరిద్దరినీ ఒక్కొక్కరికి రూ.14.20 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. వీరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా నిలిచారు. వేలం చివర్లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్లకు సొంతం చేసుకుంది. కామెరూన్ గ్రీన్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ 25.20 కోట్లుకు దక్కించుకుంది. డేవిడ్ మిల్లర్ – ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లు, వనిందు హసరంగా- లక్నో సూపర్ జెయింట్స్ 2 కోట్లు, వెంకటేష్ అయ్యర్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లు, మతీశా పతిరానా – కోల్‌కతా నైట్ రైడర్స్ 18 కోట్లు, రవి బిష్ణోయ్ – రాజస్థాన్ రాయల్స్ 7.20 కోట్లును దక్కించుకున్నారు. వీరితో పాటు జట్టులో చోటు దక్కించుకున్నవారిలో అనేక మంది ఉన్నారు. అమ్ముడుపోని భారతీయ ఆటగాళ్లును చూస్తే… వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నారు. మరో 32 మంది అమ్మడుపోలేదు. విదేశీ ఆటగాళ్లు 25 మంది అమ్ముడుపోలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం.. ఆన్‌లైన్‌లో కెమికల్స్ కొని దర్జాగా డ్రగ్స్ తయారీ
