పాక్ బౌలర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్
దుబాయ్ వేదికగా జరిగిన అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోయినా, వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చర్చనీయాంశమైంది. పాక్ పేసర్ అలీ రజా స్లెడ్జింగ్‌కు వైభవ్ షూ చూపించి కౌంటర్ ఇవ్వడం వైరల్‌గా మారింది. 14 ఏళ్ల వైభవ్ దూకుడుగా ఆడి, ప్రత్యర్థి ఆటగాళ్లకు దీటుగా బదులివ్వడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఘటనతో పాటు మ్యాచ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
దుబాయ్ వేదికగా జరిగిన అండర్ 19 ఆసియా కప్ పైనల్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ హై-వోల్టేజ్ పోరులో భారత సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, పాకిస్థాన్ పేసర్ అలీ రజా మధ్య జరిగిన మైదాన పోరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించేందుకు టీమిండియా భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించగానే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దూకుడుతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. తొలి 9 బంతుల్లోనే 24 రన్స్ చేసి వావ్ అనిపించాడు. అయితే, అలీ రజా వేసిన ఒక షార్ట్ పిచ్ బంతిని పంచ్ చేయబోయి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వైభవ్ అవుటైన వెంటనే బౌలర్ అలీ రజా.. క్రీజ్ వదిలి వెళ్తున్న వైభవ్‌ను ఉద్దేశించి ఏదో కామెంట్ చేశాడు. సాధారణంగా సైలెంట్‌గా ఉండే వైభవ్, ఈసారి వెనక్కి తగ్గలేదు. పాక్ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో వైభవ్ తన షూ వైపు వేలు చూపిస్తూ సైగలు చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో సమీర్ మిన్హాస్ 172 పరుగులు అద్భుత సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 347 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. టీమిండియా కేవలం 156 పరుగులకే ఆలౌట్ కావడంతో, పాకిస్థాన్ 191 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత జట్టు ఓడిపోయినప్పటికీ, మైదానంలో స్లెడ్జింగ్‌కు దిగిన ప్రత్యర్థి ఆటగాళ్లకు వైభవ్ ఇచ్చిన సమాధానంపై భారత్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్
సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా
మారుతున్న ప్రమోషన్ ట్రెండ్… మాయ చేస్తున్న ఏఐ
Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేదెప్పుడు?
