Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డో గ్యారేజీలోకి కొత్త కారు.. దాని ధర తెలిస్తే షాక్..!

|

Apr 06, 2023 | 8:32 AM

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు కార్లంటే యమ క్రేజ్‌. మనసు పడిందంటే చాలు.. ఎలాంటి కారైనా తన గ్యారేజీలో చేరాల్సిందే. ఇప్పటికే ఎన్నో రకాల కార్లను ఇలా జమ చేశారు. అయితే తాజాగా మరో లగ్జరీ కొత్త కారు వచ్చి చేరింది.

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు కార్లంటే యమ క్రేజ్‌. మనసు పడిందంటే చాలు.. ఎలాంటి కారైనా తన గ్యారేజీలో చేరాల్సిందే. ఇప్పటికే ఎన్నో రకాల కార్లను ఇలా జమ చేశారు. అయితే తాజాగా మరో లగ్జరీ కొత్త కారు వచ్చి చేరింది. చూస్తేనే కళ్లు చెదిరిపోవాల్సిందే. దీని ధర అక్షరాల 71 కోట్ల రూపాయలట. కొత్త కారు బుగాట్టిలో క్రిస్టియానో రొనాల్డ్ చక్కర్లు కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాట్టి.. సెంటోదియాచీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కారును మార్కెట్‌లో లాంఛ్ చేసింది. దీని ఖరీదు 80 లక్షల యూరోలు. అంటే మన భారత కరెన్సీలో సుమారు 71 కోట్ల రూపాయలు. తాజాగా ఈ కారులో తన పార్ట్ నర్ జార్జినా రోడ్రిగ్స్ తో కలిసి రొనాల్డ్ రెస్టారెంట్ కు వచ్చాడు. డిన్నర్ అనంతరం బయటికి రొనాల్డ్ బుగాట్టి కారు ఎక్కడం చూసి స్థానిక అభిమానులు ఫోటోలు క్లిక్ మనిపించారు. ఒక వ్యక్తి ఇదంతా తన ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా దానికి రొనాల్డో రీట్వీట్‌ చేయడం విశేషం. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 08:32 AM