మంధానతో పెళ్లి రద్దుపై ఇన్‌స్టాగ్రామ్ లో పలాష్ ముచ్చల్ పోస్ట్ వీడియో
క్రిక్‌టర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం రద్దైంది. నిరాధారమైన ఊహాగానాలు, పుకార్లపై పలాష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. పెళ్లికి ముందు ఇరు కుటుంబాలలో ఆరోగ్య సమస్యల వల్ల వివాహం నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఇద్దరూ ఈ బంధం నుంచి బయటకు వచ్చామని ప్రకటించారు.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం రద్దయింది. ఈ మేరకు ఇరువురూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా కాలంగా స్నేహితులుగా ఉన్న స్మృతి, పలాష్‌ల వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు.అయితే, పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి, పలాష్ ఆరోగ్యం క్షీణించాయి. దీంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వాయిదాకు పలాష్ తీరే కారణమంటూ పలు పుకార్లు, వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించిన పలాష్ ముచ్చల్, తమ వ్యక్తిగత బంధం నుంచి బయటకు వచ్చి జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నిరాధారమైన ఊహాగానాలపై జనం స్పందించడం బాధాకరమని, ఇలాంటి మాటలు మాయని గాయాలవుతాయని పేర్కొన్నారు
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
