నక్వీ బుర్ర బద్దలయ్యే న్యూస్.. త్వరలో భారత్‌ చెంతకు ఆసియా కప్ ట్రోఫీ వీడియో

Edited By: Ravi Kiran

Updated on: Nov 04, 2025 | 11:11 AM

ఆసియా కప్ 2025 గెలిచి నెల రోజులు గడిచినా ట్రోఫీ భారత్‌కు చేరకపోవడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకటి రెండు రోజుల్లో ట్రోఫీని ముంబైకి పంపకుంటే, వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తుతామని బోర్డు సంయుక్త కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పష్టం చేశారు. మొహిసిన్ నఖ్వీ పట్టుదల కారణంగా వివాదం కొనసాగుతోంది.

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమ్ ఇండియా విజయం సాధించి నెల రోజులు గడిచినా, కప్ ఇంకా భారత్‌కు చేరకపోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ ట్రోఫీ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని తాము ఆశిస్తున్నట్లు బోర్డు సంయుక్త కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. ఒకవేళ అలా జరగకపోతే, ఈ వివాదాస్పద అంశాన్ని వచ్చే నెలలో దుబాయ్‌లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్‌ చూసి షాక్‌ వీడియో

మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో

రూ.11 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు..కానీ వీడియో

Published on: Nov 03, 2025 06:40 PM