Afghanistan Crisis: విమానంపై నుంచి పడి ఫుల్‌బాల్ ప్లేయర్ దుర్మరణం..

Updated on: Aug 21, 2021 | 10:50 PM

ఆఫ్గనిస్తాన్‌‌లో మరో దారుణం చోటు చేసుకుంది. తాలిబన్ల చెర నుంచి తప్పించుకునే క్రమంలో ఆదేశ ఫుట్‌బాల్ నేషనల్ ప్లేయర్ ప్రాణాలు కోల్పోయాడు. కాబూల్ విమానాశ్రయంలో విమానంపై నుంచి కిందపడి మరణించాడు.

ఆఫ్గనిస్తాన్‌‌లో మరో దారుణం చోటు చేసుకుంది. తాలిబన్ల చెర నుంచి తప్పించుకునే క్రమంలో ఆదేశ ఫుట్‌బాల్ నేషనల్ ప్లేయర్ ప్రాణాలు కోల్పోయాడు. కాబూల్ విమానాశ్రయంలో విమానంపై నుంచి కిందపడి మరణించాడు. ఈ మేరకు ఆఫ్గన్ వార్తా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ దేశంలో తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అయితే. తాలిబన్ల పాలనకు హడలిపోతున్న అక్కడి ప్రజలు.. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వేలాది మంది ఆఫ్గన్ ప్రజలు కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తారు. అక్కడికి వచ్చిన అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలకు చెందిన విమానాలు చేరుకోగా.. వాటిల్లో వెళ్లేందుకు పరుగులు తీశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: iPhone 13: ఐఫోన్‌ 13 లాంచ్ తేదీ వచ్చేసింది.. అతి తక్కువ ధరలకే అందుబాటులో.. వీడియో

ఆ టిష్యూ పేపర్ ధర రూ.7.50 కోట్లు.. ఎవరు వాడి పడేసిందో తెలుసా..? వీడియో