సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

|

Jan 04, 2025 | 4:24 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకం. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ఈ పండక్కి సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి లక్షలాదిమంది వలస కూలీలు హైదరాబాద్‌ మహానగరానికి యేటా వస్తుంటారు. వీరంతా సంక్రాంతికి తప్పనిసరిగా తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు.

 దీంతో రైల్వే స్టేషన్లు, బస్సులు జనాలతో కిటకిటలాడిపోతుంటాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ సంక్రాంతికి ప్రత్యేక ట్రైన్లను వేసింది. పండగ రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనే ప్రయాణికులకు 6 ప్రత్యేక రైళ్లను వేసిందికాచిగూడ -కాకినాడ టౌన్‌, హైదరాబాద్‌- కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్‌ రిజర్వేషన్ల బుకింగ్‌ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్లు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జక్కన్న మాస్టర్ ప్లాన్.. అందుకే రహస్యంగా మహేష్ గెటప్..

వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు