అక్కడ మొక్క నాటితే పిల్లలు పుట్టడం ఖాయం !!

అక్కడ మొక్క నాటితే పిల్లలు పుట్టడం ఖాయం !!

Phani CH

|

Updated on: Sep 20, 2023 | 9:58 AM

పెళ్లయిన నవ దంపతులు తమ సంతానం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. దంపతులు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు సైతం తమ వంశవృద్ధి కోసం ఎంతో పరితపిస్తారు. కానీ కొందరికి పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలుగదు. అలాంటివారు ఎన్నో మొక్కులు మొక్కుతారు, పూజలు చేస్తారు. ఇటీవల కాలంలో టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ, ఐవీఎఫ్‌ విధానం అందుబాటులోకి వచ్చినా దైవాన్నే నమ్ముకుని సహజంగానే సంతానాన్ని పొందాలనుకునేవారు ఉంటారు.

పెళ్లయిన నవ దంపతులు తమ సంతానం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. దంపతులు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు సైతం తమ వంశవృద్ధి కోసం ఎంతో పరితపిస్తారు. కానీ కొందరికి పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలుగదు. అలాంటివారు ఎన్నో మొక్కులు మొక్కుతారు, పూజలు చేస్తారు. ఇటీవల కాలంలో టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ, ఐవీఎఫ్‌ విధానం అందుబాటులోకి వచ్చినా దైవాన్నే నమ్ముకుని సహజంగానే సంతానాన్ని పొందాలనుకునేవారు ఉంటారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పశ్చిమ గోదావరి జిల్లా శివదేవుని ఆలయంలో వింత ఆచారం ఆచరణలో ఉంది. ఈ శివాలయంలో మహా శివరాత్రి వచ్చిందంటే చాలు సంతానం లేని దంపతులు కొబ్బరి మొక్కలతో స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతారు. చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శివదేవ స్వామివారి ఆలయానికి వెళ్తే భక్తులు మొక్కలు నాటుతూ కనిపిస్తారు. ఇదేదో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం అనుకోకండి.. సంతానం కోసం వారు మొక్కలతో దేవుని వద్దకు వచ్చి మొక్కుకుంటారు. మగ సంతానం కావాలనుకునేవారు కొబ్బరి మొక్క, ఆడసంతానం కావాలనుకునేవారు గులాబీ మొక్క నాటితే వారు కోరుకున్న సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలోనే రిచెస్ట్‌ గణపతి.. ఏకంగా కోట్లలో బీమా !!

అలిపిరిలో దొరికిన చిరుతలకు విముక్తి !! మరో చిరుతను విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ పార్క్ కు తరలింపు

గిరిజనులను గడగడలాడిస్తున్న గజరాజులు.. అటవీ అధికారి మృతి

Birth Certificate: అక్టోబర్ 1 నుంచి బర్త్‌ సర్టిఫికేట్ కొత్త రూల్స్ !!

Indian Railways: ఇకపై భారత్ రైళ్ళలో లోయర్ బెర్త్‌లు వారికే !!