బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా తింటున్నారా ?? జాగ్రత్త !!

|

Jul 09, 2024 | 5:32 PM

బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే. బీట్ రూట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సలాడ్ లేదా జ్యూస్ రూపంలో బీట్ రూట్ లను తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు మెరుగుపడతాయి. హిమోగ్లోబిన్, ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి.

బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే. బీట్ రూట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సలాడ్ లేదా జ్యూస్ రూపంలో బీట్ రూట్ లను తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు మెరుగుపడతాయి. హిమోగ్లోబిన్, ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. అయితే, బీట్‌రూట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. బీట్ రూట్ వినియోగం కొన్ని సందర్భాల్లో శరీరానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు. బీట్ రూట్ లలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. బీట్ రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది, ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది మూత్రంలో ఆక్సలేట్ విసర్జనను పెంచుతుంది, ఇది కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. అందువల్ల, బీట్ రూట్ లను కొంత పరిమాణంలో మాత్రమే తినమని సలహా ఇస్తారు. మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే బీట్ రూట్ జ్యూస్‌ తాగకపోవడమే మంచిదంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం.. 14,15 శతాబ్లకు చెందినవిగా గుర్తింపు

Follow us on