గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు

Updated on: Jan 19, 2026 | 8:46 PM

డబ్బు కోసం మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరిస్తున్న మెడ్‌చల్ ఘటన వెలుగులోకి వచ్చింది. మత్తు ఇవ్వకుండా రక్తాన్ని పీల్చడంతో గొర్రెలు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే, గొర్రె రక్తం మైక్రోబయాలజీ పరీక్షలకు, పాము కాటుకు యాంటీవెనమ్ తయారీకి వైద్యపరంగా ఎంతో కీలకం. ఈ ప్రక్రియలో బయోసేఫ్టీ, నైతిక నియమాలు తప్పనిసరి. అక్రమ దందాతో మూగజీవాలకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డబ్బు పిచ్చితో మనుషులు ఎంతలా దిగజారిపోతున్నారో చెప్పడానికి మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. కొందరు మూగజీవాలనుండి రక్తాన్ని సేకరించి సొమ్ము చేసుకుంటున్నారు. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ.. మూగ ప్రాణులకు కనీసం మత్తుకూడా ఇవ్వకుండా రక్తాన్ని పీల్చేస్తున్నారు. దీంతో తీవ్ర రక్తహీనతకు గురై ఆ జీవాలు ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటి కేసు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. గొర్రె రక్తంతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటూ రక్తాన్ని అక్రమంగా సేకరిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజంగా గొర్రె రక్తం దేనికోసం ఉపయోగపడుతుంది? నిపుణులు ఏం అంటున్నారు? మెడికల్ పరంగా మైక్రోబయాలజీలో గొర్రె రక్తం చాలా ముఖ్యమైనది. షీప్ బ్లడ్ ఉపయోగించి మనిషి శరీరంలో ప్రవేశించిన బాక్టీరియా రక్త కణాలను ఎలా నాశనం చేస్తుందో పరీక్షిస్తారు. దానికి అనుగుణంగా మెడిసిన్ రిఫర్ చేస్తారు వైద్యులు. అంటే మనకు ఏ ఇన్ఫెక్షన్ ఉందో ఏ యాంటీబయాటిక్ సరిపోతుందో డాక్టర్లు సరిగ్గా నిర్ణయించగలుగుతారు. దీనితో పాటు యాంటీవెనమ్ తయారీలో కూడా గొర్రె రక్తాన్ని ఉపయోగిస్తారు. ఎందుకు అంటే గొర్రెల్లో బలమైన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది.. విషానికి వ్యతిరేకంగా మంచి యాంటీబాడీలు తయారవుతాయి. అందుకే యాంటీవెనమ్ తయారీలో గొర్రెల రక్తాన్ని ఉపయోగిస్తారు. యాంటీవెనమ్ పాము విషాన్ని చాలా చిన్న మోతాదులో, గొర్రెలకు ఇస్తారు. దాని తరవాత గొర్రె శరీరం యాంటీబాడీలు తయారు చేస్తుంది. అప్పుడు గొర్రె నుండి ఆ రక్తాన్ని సేకరించి, ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ యాంటీబాడీలను శుద్ధి చేసి యాంటీవెనమ్‌గా తయారు చేస్తారు. ఈ యాంటీవెనమ్ పాము కాటు బాధితుల ప్రాణాలను కాపాడుతుంది అని నిపుణులు చెబుతారు. అయితే సేకరించిన గొర్రె రక్తాన్ని చల్లని ఉష్ణోగ్రతల్లో భద్రపరచాలి. ప్రత్యేకంగా లేబుల్ చేసిన కంటైనర్లలో రవాణా చేయాలి. ఇంతటి ప్రాసెస్ కి బయోసేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్‌ సుమా

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్‌ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం

ఎముకలకు పుష్టినిచ్చే ఆహారాలు ఇవే

ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం.. అమర్‌నాథ్ కు ప్రయాణం ఇక్కడి నుంచే..