
డాక్టర్లు ఎప్పుడూ తమ కెరీర్‌లో రేర్ కేసులను సాల్వ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ కేసులు అటుంచితే.. ఇలాంటి అరుదైన కేసులను సాల్వ్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడతారు. ఇక వారి ఎక్స్‌పీరియన్స్‌ను మెడికల్ జర్నల్స్‌లో పొందుపరుస్తారు. శరీరంలోని ఏ అవయవంలోనైనా వస్తువు(Foreign Object) చొచ్చుకుపోయి ఉంటే.. దాన్ని తొలగించడానికి వైద్యులు తీవ్రంగా శ్రమిస్తారు. అవయవాలకు ఎలాంటి గాయం కాకుండా.. వస్తువును తొలగించడంలో డాక్టర్లు ప్రయత్నిస్తారు. రోగులు మళ్లీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తారు. తాజాగా అలాంటి ఓ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందామా..?
ఓ 70 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికొచ్చాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతడికి.. ఆస్పత్రిలోని వైద్యులు పలు టెస్టులు నిర్వహించడంతో పాటు.. ఎక్స్‌రే తీశారు. అతడి శరీరంలో ఓ పెర్ఫ్యూమ్ బాటిల్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స(Sigmoidoscopy) నిర్వహించి సుమారు రెండు గంటల అనంతరం ఆ బాటిల్‌ను రోగి శరీరం నుంచి తొలగించారు. ఆపై రోగి ఆరోగ్యం కుదుటపడగా.. అతడి మానసిక పరిస్థితి సరిగ్గాలేదని.. లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఇలా చేశాడని డాక్టర్లు చెప్పారు. డిశ్చార్జ్ చేసే ముందు అతడికి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించామని డాక్టర్లు మెడికల్ జర్నల్‌లో పేర్కొన్నారు. కాగా, క్షణిక సుఖం కోసం ఇలాంటి పిచ్చి చేష్టలు ఎవ్వరూ చేయకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. (Source)
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..