ఇది మితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.. మోతాదు మించితే హానికరం

Updated on: May 11, 2025 | 8:54 AM

మన శరీరానికి అవసరమైన పోషకాల జాబితాలో ఉండే సెలీనియం గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ సూక్ష్మ ఖనిజ లవణం మన ఆరోగ్యానికి అత్యంత కీలకమని ముఖ్యంగా గుండె ఆరోగ్య పరిరక్షణలో దీని పాత్ర ఎంతో ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన పరిమాణంలో తీసుకుంటే గుండెకు మేలు చేసే సెలీనియం అదే మోతాదు మించితే మాత్రం హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే ప్రముఖ జర్నల్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం సెలీనియం వినియోగానికి గుండె జబ్బుల ముప్పుకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే డేటాను ఉపయోగించి జరిపిన ఈ పరిశోధనలో శరీరానికి అవసరమైనంత మేర సెలీనియం తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని తేలింది. అయితే అవసరానికి మించి సెలీనియం తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు తారుమారయ్యే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరించారు. సెలీనియం ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. జీవక్రియలు సక్రమంగా జరగడానికి థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడడానికి కూడా సెలీనియం అవసరం. మనకు రోజువారీ తీసుకునే ఆహారం బ్రెజిల్ నట్స్, గుడ్లు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సీఫుడ్స్, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, మాంసం ద్వారా సెలీనియం లభిస్తుంది. సెలీనియం కోసం కొందరు సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే ఇవి అవసరమా? రోజు ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయానికి వస్తే శరీరం ఆహారం నుంచి సెలీనియం ను అసమర్థవంతంగా గ్రహిస్తుందని సప్లిమెంట్ల రూపంలో కాకుండా ఆహార వనరుల ద్వారా లభించే సెలీనియం ప్రభావం గురించి తమ అధ్యయనంలో పరిశీలించినట్లు పరిశోధకులు తెలిపారు. కాబట్టి సప్లిమెంట్ల అవసరం సాధారణంగా ఉండదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాల్ నట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసా ??