అయోధ్య బాల రాముడి శిల్పం రూపకర్త ఎవరో తెలుసా ??

|

Jan 03, 2024 | 12:42 PM

అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు.

అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ అని పేర్కొన్నారు. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు ఈ అరుదైన అదృష్టం దక్కింది. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన శిల్పం ఎంపికపై రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలోని రామ భక్తుల సంతోషం రెట్టింపైందన్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్ ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ విమాన ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం గుడ్‌ న్యూస్‌

ఆ గ్రామంలో ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే

కొత్త సంవత్సరం తొలి రోజున భారతీయుల వరల్డ్‌ రికార్డ్‌

ఒక్క రోజులో రూ. 460 కోట్ల లిక్కర్ తాగేశారు

Sudigali Sudheer: సైలెంట్‌గా.. ట్విస్ట్ ఇచ్చిన గాలోడు

Follow us on