తొలి సినిమా ఎడిటర్ సారస్వతిబాయి ఫాల్కె ! ఆమె ఎవరో తెలుసా?
భారతీయ సినిమా తొలి ఎడిటర్ సారస్వతీబాయి ఫాల్కే. దాదాసాహెబ్ ఫాల్కే సతీమణిగా, రాజా హరిశ్చంద్ర నిర్మాణంలో ఆమె సాంకేతిక, ఆర్థిక మద్దతు అందించారు. రీల్స్ కటింగ్, ఫిల్మ్ డెవలప్‌మెంట్, కాస్ట్యూమ్స్ నిర్వహణతో పాటు ఆర్థిక సమస్యల నివారణకు తన ఆభరణాలను సైతం విక్రయించారు. ఆమె కృషి చరిత్రలో మరుగున పడినా, నేడు గుర్తింపు పొందుతోంది.
భారతీయ సినిమా నేడు వందల కోట్లు వసూలు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద సినీ రంగాలలో ఒకటిగా నిలుస్తోంది. అయితే, ఈ స్థాయికి రావడానికి వందేళ్లకు పైగా కృషి జరిగింది. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే రూపొందించిన తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్ర నిర్మాణంలో ఆయన సతీమణి సరస్వతీబాయి ఫాల్కే అసాధారణ పాత్ర పోషించారు.ఆ కాలంలో కెమెరాలు, రీల్స్, ఎడిటింగ్ మెషీన్లు కొత్తగా ఉన్న రోజుల్లో, సారస్వతీబాయి స్వయంగా ఎడిటింగ్ నేర్చుకుని భారతీయ సినిమాకు తొలి ఫిల్మ్ ఎడిటర్‌గా నిలిచారు. రీల్స్‌ను కట్ చేయడం, జోడించడం, కెమికల్స్ కలపడం, ఫిల్మ్ డెవలప్ చేయడం, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ నిర్వహించడం వంటి సాంకేతిక పనులన్నీ ఆమె చూసుకున్నారు. మహిళలు సినిమా సెట్‌లకు రావడం అరుదైన రోజుల్లో, కుటుంబాన్ని చూసుకుంటూనే ఈ పనులు చేయడం ఆమె అంకితభావానికి నిదర్శనం.
మరిన్ని వీడియోల కోసం :
