రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్

Updated on: Jan 10, 2026 | 4:49 PM

సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా నిర్వహణ ఖర్చులు పెరిగాయని, బస్సుల అద్దెలు పెంచాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ₹5,200 పెంపు సరిపోదని, నెలకు ₹15-20 వేలు అదనంగా చెల్లించాలని కోరుతున్నారు. ఈ సమ్మె జరిగితే పండుగ వేళ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు.

సంక్రాంతి వేళ ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మెకు రంగం సిద్ధమవుతోంది. ఆర్టీసీకి అద్దె బస్సులు నడిపే యజమానులు.. సమ్మె సైరన్ మోగించారు.ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. మహిళలకు ఉచిత పథకం వల్ల తమ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, కనుక తమకు బస్సుల అద్దెలను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి వేళ ఊహించని రీతిలో ఆర్టీసీ అద్దె యాజమానులు సమ్మె బాట పడతామని ప్రకటన చేయటంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం ఆర్టీసీ ఎండీకి అద్దె బస్సుల యాజమాన్యాలు సమ్మె నోటీసు ఇచ్చారు. తమకు ప్రభుత్వం నుంచి అదనంగా రూ.15 వేల నుంచి రూ.20 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం వీరితో మాట్లాడిన ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు.. ఒక్కో బస్సుకు నెలకు రూ.5,200 చొప్పున ఇస్తామంటూ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అద్దె బస్సుల యజమానులు.. సమ్మెకు సిద్దమయ్యారు. ప్రస్తుతం ఏపీలో 2,700 అద్దె బస్సులున్నాయి. వీటిల్లో 2,419 బస్సులు స్త్రీ శక్తి పథకం కోసం నడుపుతున్నారు. వీటిల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు వంటి బస్సులు ఉన్నాయి. ఒకవేళ నిజంగా బస్సు యజమానులు సమ్మెకు దిగితే.. పండుగ వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అద్దె బస్సు యజమానులతో చర్చిస్తామని ఏపీ ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

ప్రతిరోజూ టమాటా తింటున్నారా.. ఇది మీకోసమే

Silver Hallmark: వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి!

మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా